బిజినెస్

డిజిటల్‌కు మరింత ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: దేశ వ్యాప్తం గా డిజిటల్ లావాదేవీలను పెం పొందించేందుకు భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎన్‌పిసిఐ) విస్తృత స్థాయిలో ప్రచార చైతన్య కార్యక్రమాలను చేపట్టబోతోంది. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్ లు, రూపే, డెబిట్ కార్డులు తదితర మార్గాల్లో దైనందిన లావాదేవీలను ఏ విధంగా నిర్వహించుకోవచ్చునో సామాన్యులకు తెలియజేస్తారు. ఇప్పటికే ఆన్‌లైన్ లావాదేవీలను విస్తృత ప్రాతిపదికన పెంపొందించేందుకు ఎన్‌పిసిఐ ఎన్నో చర్యలు చేపట్టింది. నగదుపై ఎక్కువగా ఆధారపడకుండా డిజిటల్ లావాదేవీలను ప్రజలు ఎక్కువగా చేసేలా చూడాలనేదే ఈ మెగా ప్రచార కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ఎన్‌పిసి ఐ మేనేజింగ్ డైరెక్టర్ ఏపి కోటా తెలిపారు. పెద్ద నోట్ల రద్దు సమయంలోనే డెబిట్ కార్డు వినియోగం ఆరు రెట్లు పెరిగిందని, అలాగే ఈ కామర్స్ లావాదేవీలు కూడా దాదాపు అయిదు రెట్లు పెరిగాయని ఆయన వెల్లడించారు.
అయితే ఫిబ్రవరి నెలలో ఈ లావాదేవీల స్థాయి తగ్గిందని, అనంతర కాలంలో కూడా అదే పరిస్థితి కొనసాగటంతో ఈ తాజా కార్యక్రమాన్ని చేపట్టాలని సంకల్పించినట్లు తెలిపారు. మే నెలలో డిజిటల్ లావాదేవీలు మరింత పుంజుకుని జనవరి స్థాయికి చేరుకోగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రానున్న అన్ని నెలల్లోనూ ప్రజలు డిజిటల్ లావాదేవీలపైనే ఎక్కువగా ఆధారపడేలా వినూత్న రీతిలో ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ముఖ్యం గా రూపే కార్డు, బీమ్ యాప్ మొదలైన వాటిపై ప్రజల్లో అవగాహన, చైతన్యాల్ని పెంపొందిస్తామని, అలాగే ఆధార్ పే పై కూడా వారిలో చైతన్యాన్ని కలిగిస్తామని తెలిపారు. డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ఏయే మార్గాలు, పద్ధతులు అందుబాటులో ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ ప్రచారంలో భాగంగా ప్రజల ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఇప్పటికే ఎన్‌పిసి ఐ 37కోట్ల రూపే డెబిట్ కార్డులను జారీ చేసిందన్నారు. వీటిలో 25కోట్ల కార్డులు ప్రధానమంత్రి జనధన్ కార్డులేనని కోటా వెల్లడించారు. వీటి వినియోగం కూడా జారీ చేసినప్పటి నుంచి రోజురోజుకూ పెరగడాన్ని బట్టి చూస్తే డిజిటల్ లావాదేవీల పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్న విషయం స్పష్టం అవుతోందన్నారు.