బిజినెస్

జీఎస్టీతో సరికొత్త శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 14: దేశ ఆర్థిక వ్యవస్థ అన్ని విధాలుగా పటిష్ఠం కావాలంటే డిజిటల్ విధానమే శరణ్యమని కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్‌వాల్ ఆదివారం ఇక్కడ ఉద్ఘాటించారు. నల్లధనాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయటంతో పాటు ఆర్థిక వ్యవస్థలోని డొల్ల తనాన్ని కూడా ఈ విధానం తొలగిస్తుందని ఆయన పేర్కొన్నారు. నల్లధన మార్కెట్ లెక్కలేని ఆదాయపు లెక్కలు, దేశ ఆర్థిక వ్యవస్థను తొలిచేసాయని, ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న చారిత్రక డిజిటలైజేషన్ నిర్ణయం వల్ల ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని, ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న మేఘ్‌వాల్ వెల్లడించారు. దాదాపు 22 నుంచి 26 శాతం నల్లధనం అక్రమ లావాదేవీలే దేశ ఆర్థిక వ్యవస్థను దొలిచేశాయని, సమాంతరంగా అధికారిక ఆర్థిక వ్యవస్థతో పాటు ఇది కొనసాగటం వల్ల అయోమయ పరిస్థితి ఏర్పడిందని మేఘ్‌వాల్ తెలిపారు. ఈ డొల్ల ఆర్థిక వ్యవస్థను ఎంతగా నియంత్రిస్తే అంతగానూ స్థూల జాతీయోత్పత్తి ఇనుమడిస్తుందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తరువాత భారత ఆర్థిక వ్యవస్థ ఎంతగానో పుంజుకుందని ఆన్‌లైన్ లావాదేవీలు కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తున్నాయని మేఘ్‌వాల్ తెలిపారు. అన్నిరకాల ఆర్థిక దుర్మార్గాలను అరికట్టడానికే డిజిటల్ ఇండియా అనివార్యమైందని ఉద్ఘాటించారు. అన్ని విధాలుగానూ వినియోగంలోనూ వృద్ధి, పెట్టుబడులు పెరగటం, ఎగుమతులు ఇనుమడించటం వంటి గుణాత్మక ఆర్థిక కార్యకలాపాలు ఇటీవలి కాలంలో ఎంతగానో పుంజుకున్నాయన్నారు. వీటన్నింటి కారణంగానే స్థూల జాతీయోత్పత్తి కూడా బలంగా స్థిరంగా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. డిజిటల్ ఇండియా శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన మేఘ్‌వాల్ 2017సంవత్సరం ఆర్థిక సంస్కరణల ఏడాదిగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. డిజిటలైజేషన్ వల్ల జి ఎస్టీ కూడా ఇదే ఏడాది అమల్లోకి రాబోతోందని, ఇదీ ఓ చారిత్రక నిర్ణయమేనని తెలిపారు. అలాగే కేంద్ర బడ్జెట్‌తో రైల్వే బడ్జెట్ విలీనం చేయటమూ గత ఏడు దశాబ్దాలలో మొట్ట మొదటిసారిగా తీసుకున్న నిర్ణయమని చెప్పారు.