బిజినెస్

సైబర్ దాడితో కలకలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లపై హ్యాకర్లు ‘రాన్సమ్ వేర్’ వైరస్‌తో దాడి చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో సైబర్ దాడి కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు సంస్థల వెబ్‌సైట్లు హ్యాక్ అయినట్టు సమాచారం. అయితే తమకు లిఖితపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదులు రాలేదని టెక్నికల్ సర్వీసుల విభాగం అధికారులు చెబుతున్నారు. డేటా తస్కరణకు గురి కాకుండా తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైనప్పటికీ, ప్రైవేటు సంస్థలపై సైబర్ దాడి ఆగలేదు. నగరంలోని జీడిమెట్లలోని రెండు పరిశ్రమలు, కాటేదాన్, ఎల్‌బి నగర్ పరిధిలోని మరో పరిశ్రమ, సైబరాబాద్‌లోని రెండు రసాయన పరిశ్రమల వెబ్‌సైట్ల డేటా హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. కంప్యూటర్లలో డేటా బ్యాకప్ చేసుకునే వీలు లేకపోడంతోనే వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురైనట్టు సమాచారం. బ్యాంకుల్లోని కంప్యూటర్లపై రాన్సమ్ వేర్ వైరస్ దాడి జరిగిందా? తమ ఖాతాలకు ఏమైనా ముప్పు జరిగిందా? ఖాతాల్లోని డబ్బులు బదిలీ అయ్యాయా? అనే ఆందోళన పలువురు ఖాతాదారుల్లో వ్యక్తమవుతోంది. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో ఖాతాదారులు మరింతగా భయపడుతున్నారు. సోమవారం బ్యాంకు వెళ్లి తమ ఖాతాల్లోని డబ్బులు చూసుకోవాలని ఖాతాదారులు ఆత్రుతతో ఉన్నారు. ఈ విషయమై టెక్నికల్ సర్వీసుల డైరెక్టర్ జనరల్ కృష్ణప్రసాద్‌ను వివరణ కోరగా ‘‘ప్రపంచమంతా సైబర్ దాడి జరుగుతోంది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ, పోలీస్ శాఖలోని ఐటి సెల్ విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు. టేటా తస్కరణకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కొన్ని ప్రైవేటు సంస్థల వెబ్‌సైట్లు హ్యాక్ అయి ఉండవచ్చు’ అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అపరిచిత వ్యక్తుల నుంచి ఈ-మెయిల్స్‌కు వచ్చే మెస్సేజ్‌లను వ్యక్తిగతంగా కూడా క్లిక్ చేయవద్దని, కంప్యూటర్లలో ఎలాంటి వీడియోలు, అటాచ్‌మెంట్లు డౌన్‌లోడ్ చేయవద్దని కృష్ణప్రసాద్ హెచ్చరించారు.