బిజినెస్

కొత్త ఉత్పత్తులతో గోద్రెజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: ఎఫ్‌ఎంసిజి రంగంలో గణనీయమైన ప్రాబల్యం కలిగిన గోద్రేజ్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రజల వ్యక్తిగత అవసరాలు తీర్చే సరికొత్త ఉత్పత్తులతో ముందుకు రాబోతోంది. సబ్బులు, హెయిర్‌డై లకు సంబంధించి కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి తెస్తామని ఈ సంస్థ తెలిపింది. ప్రస్తుత బ్రాండ్ల పేరుతోనే ఈ కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తాయని, భారత్‌లోనే కాకుండా ఇండోనేషియా మార్కెట్‌లో కూడా వీటిని విడుదల చేస్తామని జిసిపి ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ గంభీర్ వెల్లడించారు. ప్రస్తుతం సింథాల్ పేరుతోనే వివిధ రకాల సబ్బులను ఈ సంస్థ మార్కెట్‌లోకి తెస్తోంది. హెయిర్‌డై రంగంలో ఎక్స్‌పర్ట్ బి బ్లంట్, రెన్యూ వంటి వాటిని తీసుకురాబోతున్నట్లు వివేక్ గంభీర్ తెలిపారు.