బిజినెస్

ఐటి ఉద్యోగులకు లే ఆఫ్ సెగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులు ఆటోమేషన్ ప్రాధాన్యత పెరగటంతో దీని ప్రభావం అనేక ఐటి కంపెనీలపై గణనీయంగానే పడింది. రానున్న రెండేళ్ల కాలంలో ఇన్ఫోసిస్, కాగ్నిజాంట్, టెక్ మహింద్ర సహా పెద్ద ఐటి కంపెనీలు లే ఆఫ్‌లకు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే పనితీరు మదింపు ప్రక్రియలో భాగంగా వేలాది ఉద్యోగులకు ఈ కంపెనీలు పింక్ స్లిప్‌లను అందిస్తున్నాయని భావిస్తున్నారు. లే ఆఫ్ ప్రక్రియ ప్రస్తుత పరిస్థితుల్లో అధిగమించటానికి ఉద్దేశించిందే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న అసలు కారణం సాధ్యమైనంత మేర ఖర్చులను తగ్గించుకోవటమేనని చెప్తున్నారు. ముఖ్యంగా లక్షిత మార్కెట్‌లో రక్షిత విధానాలు పెరగటం కూడా ఈ భారీ ఐటి కంపెనీలపై తీవ్రంగానే ఒత్తిడి పెంచుతోంది. నిన్న మొన్నటి వరకు సాఫ్ట్ వేర్ ఎగుమతులు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ, అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు చేపట్టిన ప్రతికూల నిర్ణయాలతో భారత ఐటి రంగానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. దీనితో పాటు ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో సరికొత్త టెక్నాలజీ రావటం కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలన్న ఆలోచనకు పదు ను పెట్టినట్లుగా చెప్తున్నారు. ఈ తాజా సాంకేతిక ప్రక్రియల వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరం లేకుండానే అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు తాము అనుసరించిన పనితీరు వ్యూహాలను, విధానాలను ఐటి కంపెనీలు పున: పరీశీలన చేసుకుంటున్నాయి. ఐటి పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నంత వేగంగా ఉద్యోగుల సామర్థ్యం పెరగక పోవటం కూడా ఈ తాజా ఆలోచనకు ఊపిరి పోస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇలాంటి వారిని కొనసాగించటం అంటే కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోకపోవటమే అవుతుందని ఐటి కంపెనీలు భావిస్తున్నట్లుగా నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ప్రతి మూడు నుంచి అయిదు సంవత్సరాల కాలంలో అన్ని ఐటి కంపెనీలు తమ విధానాలను పున: పరిశీలించుకుని సహేతుకతను పాదుకొలిపే ప్రయ త్నం చేస్తాయని, ఆ విధంగా ఆధునిక టెక్నాలజీలను వినియోగంలోకి తీసుకువస్తాయని గ్లోబల్ హంట్ ఎండి సునీల్ గోయల్ చెప్తున్నారు.
అయితే ఈసారి మాత్రం ఐటి ఉద్యోగుల విషయంలో అమెరికా ప్రతికూల విధానాలను చేపట్టడం వల్ల దీని ప్రభావం భారత సాఫ్ట్‌వేర్ కంపెనీలపై తీవ్రంగానే పడిందన్నారు. ఈ పరిస్థితి మరో రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని ఒక రకంగా చెప్పాలంటే ఐటి నిపుణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాన్ని పదును పెట్టుకోవచ్చని కూడా ఆయన వెల్లడించారు. ఏ విధంగా చూసినా ఐటి రంగంలో ఏర్పడిన ఈ సంధికాలం ఇబ్బందికరమే అయినప్పటికీ దీన్నించి కూడా ఐటి రంగం కొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలిగితే భవిష్యత్ సవాళ్లను మరింత దీటుగా ఎదుర్కోగలదని తెలిపారు. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టెక్ మహింద్ర, విప్రో వంటి సంస్థల్లో ఈ ఉద్యోగుల కోత అన్నది 2.3శాతం మేర ఉండే అవకాశం ఉన్నదని జపాన్ బ్రోకరేజి సంస్థ నోమురా విశే్లషిస్తోంది. కొత్త టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాన్ని సంతరించుకునే వరకూ ఈ రకమైన పరిస్థితి తప్పదని స్పష్టం చేసింది.