బిజినెస్

ఉద్యాన పంటలకు త్వరలో బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ధరలతో పాటు ఉత్పత్తిలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకుని నిలబడే విధంగా రైతులకు చేయూతనిచ్చేందుకు తేయాకు, కాఫీ, రబ్బరు తదితర ఉద్యాన పంటలకు మార్కెట్ ఆధారిత బీమా పథకాన్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఉద్యాన పంటలకు ఉద్దేశించిన ఈ రెవెన్యూ ఇన్సూరెన్సు పథకాన్ని నియమ, నిబంధనలు ఖరారైన వెంటనే ప్రారంభించడం జరుగుతుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఉద్యాన పంటలకు సంబంధించిన ధరల స్థిరీకరణ నిధి నుంచి ఈ పథకానికి నిధులు సమకూర్చడం జరుగుతుందని, ప్రయోగాత్మకంగా తొలుత ఏడు జిల్లాల్లో ఉద్యాన పంటలకు ఈ పథకాన్ని అమలుచేసి మార్కెట్ ధరలతో పాటు ఉత్పత్తిలో ఎదురయ్యే ఒడిదుడుకుల నుంచి రైతులకు రక్షణ కల్పించడం జరుగుతుందని ఆ అధికారి స్పష్టం చేశారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాల వలన పంట దిగుబడులు తగ్గిపోతుండటం, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న పరిణామాల వలన ధరలు ఒడిదుడుకులకు లోనవుతుండటంతో ఉద్యాన పంటల రైతులు తీవ్రంగా నష్టపోతున్న విషయం తెలిసిందే. దేశంలో ప్రస్తుతం దాదాపు 16 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని, తద్వారా దాదాపు 17.10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తోందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తన నివేదికలో స్పష్టం చేసింది. దేశంలోని మొత్తం సాగు భూముల్లో ఉద్యాన పంటల విస్తీర్ణం దాదాపు 1 శాతం మాత్రమే ఉన్నప్పటికీ వ్యవసాయ ఎగుమతుల ద్వారా వస్తున్న మొత్తం ఆదాయంలో ఉద్యాన పంటల వాటా దాదాపు 15 శాతంగా ఉందని, కనుక ప్రకృతి విపత్తుల వలన పంటలకు జరుగుతున్న నష్టంతో పాటు ధరల ఒడిదుడుకుల నుంచి తట్టుకుని నిలబడే విధంగా ఉద్యాన రైతులకు చేయూతను అందించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వాని వాణిజ్య శాఖ సూచించింది.