బిజినెస్

టిసిఎస్ నుంచి త్వరలో మెగా బైబ్యాక్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: దేశంలోని సాఫ్ట్‌వేర్ సేవల సంస్థల్లో అతిపెద్దదైన టిసిఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ఈ నెల 18వ తేదీ నుంచి 16 వేల కోట్ల రూపాయల షేర్ల మెగా బైబ్యాక్ ఆఫర్‌ను ప్రారంభించనుంది. ఇందుకోసం ఆ సంస్థ గత నెలలోనే తమ వాటాదారుల నుంచి అనుమతి పొందింది. గురువారం ప్రారంభమయ్యే ఈ బైబ్యాక్ ఆఫర్ ఈ నెల 31వ తేదీన ముగుస్తుందని టిసిఎస్ ప్రకటించింది.అర్హులైన వాటాదారులకు ఈ నెల 16వ తేదీన, లేదా అంతకంటే ముందే ఈ బైబ్యాక్ ఆఫర్‌కు సంబంధించిన లేఖలను పంపుతామని, ఇది గనుక విజయవంతమైతే 2012లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.10,400 కోట్లతో జరిపిన బైబ్యాక్‌ను అధిగమించి దేశంలో ఇదే అతిపెద్ద బైబ్యాక్ ఆఫర్ అవుతుందని టిసిఎస్ వివరించింది.