బిజినెస్

ఐటి కంపెనీల్లో అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: ఐటి రంగంలో ఉద్యోగాల తొలగింపు అనేది సర్వసాధారణమని, దీనికి ఆందోళన చెందడం, అతిగా ప్రచారం చేయడం వద్దని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. ఐటి, ఐటి ఆధారిత కంపెనీల్లో సాధారణంగా జరిగే ఉద్యోగుల తొలగింపుపై ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, ఎక్కువ ఉత్సుకత చూపుతున్నారని అయన తెలిపారు. ఉద్యోగుల తోలగింపు అనేది ఈ రంగంలో ప్రతి సంవత్సరం జరిగేదేనని చెప్పారు. ఇదేదో మొదటి సారి జరిగినట్టుగా భావిస్తున్నారని అన్నారు. కాగ్నిజెంట్ కంపెనీకి చెందిన కొందరు కార్మికులు తమను తొలగించేందుకు అక్రమంగా నోటీసులు ఇచ్చారని రాష్ట్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ అంశం గురించి విలేఖరులు ప్రస్తావించినప్పుడు ప్రతి సంవత్సరం పనితీరును మదింపు చేస్తారని, పనితీరు బాగా లేక పోతే ప్రతి సంవత్సరం ఇలా ఉద్యోగుల తొలగింపు సర్వసాధారణం అని చెప్పారు. ఖాతాదారుల అవసరాలకు సరిపడే విధంగా, లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా ఉద్యోగికి నైపుణ్యం అవసరం అని అన్నారు.
సాంకేతిక రంగంలో మార్పుల వల్ల ఏటా 1.75 నుంచి రెండు లక్షల వరకు ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని హెడ్ హంటర్ ఇండియా ఒక నివేదిక విడుదల చేసింది. ఎప్పటికప్పుడు అవసరం అయిన సాంకేతిక నైపుణ్యం కలిగి ఉండాలని కెటిఆర్ అన్నారు.
దేశంలో తెలంగాణ ప్రధానమైన ఐటి హబ్‌గా మారిందని కెటిఆర్ తెలిపారు. దేశ సగటు వృద్ధి రేటు కన్నా తెలంగాణలో ఐటి వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుందని అంచనా వేసినట్టు చెప్పారు. హైదరాబాద్ 75వేల కోట్ల రూపాయల ఐటి ఎగుమతులతో రికార్డు సృష్టించిందని చెప్పారు. కరెన్సీ రద్దు తరువాత తెలంగాణలో డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగాయని చెప్పారు. డిజిటల్ లావాదేవీల్లో దేశంలో మొదటి తెలంగాణ మొదటి స్థానంలో నిలిచినట్టు కెటిఆర్ తెలిపారు. తెలంగాణలో నెలకు 20 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రజలు టెక్‌సావీలు అని అన్నారు. తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని, నెలకు 20కోట్ల ఆన్‌లైన్ లావాదేవీలు అంటే డిజిటల్ తెలంగాణకు ఇంకేం కావాలని కెటిఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు వేల స్టార్టప్ కంపెనీలు ఉన్నాయని చెప్పారు. నగరంలో మూడు వేల హాట్‌స్పాట్ ఏర్పాటు చేసినట్టు కెటిఆర్ తెలిపారు.