బిజినెస్

ఈ ఏడాది వృద్ధిరేటు 7.4 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నట్లు భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (్ఫక్కీ) తమ అధ్యయన నివేదికలో స్పష్టం చేసింది. ఈ ఏడాది వ్యవసాయ రంగ వృద్ధిరేటు 3.5 శాతానికి చేరుకోవడంతో పాటు పారిశ్రామిక, సేవా రంగాల పనితీరు మరింత మెరుగుపడుతుందని వివిధ అంచనాలు స్పష్టం చేస్తుండటమే ఇందుకు కారణమని ఆ నివేదిక పేర్కొంది. అయితే గత (2016-17) ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధిరేటు 6.6 శాతం నుంచి 7.1 శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నామని, చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో నమోదయ్యే వృద్ధిరేటు తొలి మూడు త్రైమాసికాల్లో నమోదైన వృద్ధిరేటు గణాంకాల కంటే తక్కువగా ఉండవచ్చని కొందరు నిపుణులు భావిస్తుండటమే ఇందుకు కారణమని ఈ సర్వేలో పాల్గొన్న ఆర్థికవేత్తలు తెలిపారు. గత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికంలో 7 శాతం వృద్ధి రేటు నమోదైనట్లు కేంద్ర గణాంకాల సంస్థ ఇటీవల విడుదల చేసిన జిడిపి వృద్ధి అంచనాలు తెలియజేస్తున్నాయి. దీనిని బట్టి చూస్తుంటే జిడిపి వృద్ధి రేటుపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం నామమాత్రమేనని, కనుక గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద జిడిపి వృద్ధిరేటు 7.1 శాతంగా ఉండవచ్చని స్పష్టమవుతోందని ఫిక్కీ తన నివేదికలో పేర్కొంది.
ఇదిలావుంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, కనిష్ఠంగా 7 శాతం, గరిష్ఠంగా 7.6 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని భావిస్తున్నామని ఫిక్కీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు మరింత మెరుగ్గా ఉంటుందని అంచనాలు స్పష్టం చేస్తున్నందున ప్రపంచంలో అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన పేరును నిలబెట్టుకుని చైనా కంటే ముందంజలో నిలిచే అవకాశాలు ఉన్నాయని ఫిక్కీ ఈ నివేదికలో పేర్కొంది.