బిజినెస్

గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన ఐసిఐసిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: దేశంలోని ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన ఐసిఐసిఐ బ్యాంకు సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఎదురుచూస్తున్న మధ్యతరగతి ప్రజలకు తీపి కబురు అందించింది. 30 లక్షల రూపాయల లోపు గృహ రుణాలపై ఆ బ్యాంకు వడ్డీ రేటును 0.3 శాతం తగ్గించింది. తక్కువ ధరలో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవాలని ఎదురుచూస్తున్న వారికి ఊతమివ్వాలన్న ప్రయత్నంలో భాగంగా 30 లక్షల రూపాయలు లోబడిన గృహ రుణాలపై వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గిస్తున్నామని, దీంతో వేతన జీవులు అతితక్కువ వడ్డీరేటుకే గృహ రుణాలను పొందగలుగుతారని, మహిళా ఉద్యోగులకు 8.35 శాతం వడ్డీతోనూ, ఇతరులకు 8.40 శాతం వడ్డీతోనూ గృహ రుణాలను అందజేస్తామని ఐసిఐసిఐ బ్యాంకు ఒక ప్రకటనలో వెల్లడించింది.
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కూడా గృహ రుణాలపై వడ్డీ రేటును ఇప్పటికే 25 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించిన విషయం విదితమే. మహిళా వేతన జీవులకు అతితక్కువగా 8.35 శాతం వడ్డీతో గృహ రుణాలను అందజేయనున్నట్లు ఆ బ్యాంకు గత వారం ప్రకటించింది. దేశీయ బ్యాంకింగ్ పరిశ్రమలో దాదాపు 26 శాతం వాటాను కలిగివున్న ఎస్‌బిఐ గృహ రుణాల మార్కెట్‌లోనూ అగ్రగామిగా ఉంది. ఇదిలావుంటే, ప్రైవేటు రంగంలోని అతిపెద్ద బ్యాంకుల్లో రెండవదిగా ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కూడా ఇప్పటికే గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది. 75 లక్షల రూపాయల లోపు రుణాలను పొందే మహిళల నుంచి 8.65 శాతం వడ్డీని, ఇతరుల నుంచి 8.7 శాతం వడ్డీని వసూలు చేయనున్నట్లు ఆ బ్యాంకు ప్రకటించింది. దీంతో మార్కెట్‌లో నెలకొన్న పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఇతర బ్యాంకులు కూడా గృహరుణాలపై త్వరలోనే వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.