బిజినెస్

మాల్యాని వెనక్కి పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: బ్యాంకులకు ఉద్దేశ్యపూర్వకంగా వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి, రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యాను భారత్‌కు తిప్పి పంపాలని కేంద్ర ప్రభుత్వం గురువారం లాంఛనంగా బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది. గత నెల 2వ తేదీన లండన్‌కు వెళ్లిపోయిన మాల్యా స్వదేశానికి తిరిగివచ్చి దర్యాప్తు అధికారులకు, బ్యాంకులకు సహకరించాలని స్పష్టం చేస్తూ ఇప్పటికే పలుమార్లు ఆదేశాలను జారీ చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆయనను స్వదేశానికి తిప్పి పంపాలని బ్రిటన్‌కు భారత్ విజ్ఞప్తి చేసింది. కొద్ది రోజుల క్రితమే మాల్యా పాస్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం త్వరలో ఆయనను పార్లమెంట్ నుంచి బహిష్కరించే అవకాశాలు కూడా ఉన్నాయి. భారతీయులకు సరసమైన ధరల్లో విలాసవంతమైన విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువస్తానని పేర్కొంటూ 2003లో మాల్యా ప్రారంభించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయి పట్టుమని పదేళ్లు తిరక్కుండానే చతికిలబడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మాల్యా దేశాన్ని వీడి వెళ్లకుండా నిరోధించాలని 18 బ్యాంకులతో కూడిన కన్సార్టియం సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అప్పటికే ఆయన లండన్‌కు పారిపోయినట్లు తేలింది. అయితే తానేమీ పారిపోలేదని, బ్యాంకుల కన్సార్టియంతో పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడానని మాల్యా చెబుతుండగా, రుణ బకాయిల చెల్లింపు విషయమై మాల్యా చేసిన ప్రతిపాదనలను బ్యాంకులు తిరస్కరించాయి. ఈ విషయమై మాల్యా తమతో వ్యక్తిగతంగా చర్చలు జరిపి, మొదటి విడతగా తమకు చెల్లిస్తానని చెబుతున్న మొత్తాన్ని పెంచాలని బ్యాంకులు పట్టుబడుతున్నాయి. ఇదిలావుంటే, బ్యాంకుల నుంచి పొందిన రుణాల్లో మాల్యా కొంత మొత్తాన్ని వెచ్చించి విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆ అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు జరుపుతోంది. ఈ ఆరోపణను మాల్యా తోసిపుచ్చినప్పటికీ ఆయన అరెస్టుకు ముంబయిలోని కోర్టు వారెంట్ జారీ చేసింది. మరోవైపు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని తెలిసినప్పటికీ బ్యాంకులు, ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా ఆ సంస్థకు భారీ మొత్తంలో ఎందుకు రుణాలు ఇచ్చాయన్న దానిపై సిబిఐ కూడా దర్యాప్తు జరుపుతోంది.