బిజినెస్

బెల్జియంలో విస్తృత అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 16: బెల్జియం దేశంలో విస్తృత వాణిజ్యావకాశాలు ఉన్నాయని, భారత్‌లోని వ్యాపార వేత్తలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని బెల్జియం ట్రేడ్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్ డెవలప్‌మెంట్ కమిషనర్ జయంత్ నడిగర్ అన్నారు. ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఇండియా - బెల్జియం ద్వైపాక్షిక వాణిజ్య ప్రమోషన్‌లో భాగంగా విశాఖలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్ - బెల్జియం దేశాల మధ్య సామరస్య సంబంధాలున్నాయన్నారు. ఇరు దేశాల ప్రభుత్వాలు వ్యాపార, వాణిజ్య అవసరాల తీర్చేందుకు పలు సానుకూల అంశాలను అమలు చేస్తున్నాయన్నారు. భారత్ నుంచి వచ్చే వ్యాపారులకు బెల్జియం ప్రభుత్వం అవసరమైన సదుపాయాలన్నింటినీ సమకూరుస్తుందని హామీ ఇచ్చారు. ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ వ్యాపార, వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకుంటున్నాయని వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు నంద గోపాల్, కృష్ణ కిషోర్, కెఎన్ రావు, లంకా మోహనరావు తదితరులు భారత్‌లో గల వాణిజ్య అవకాశాలను వివరించారు. పరస్పర సహకారంతో ఇరు దేశాలు వాణిజ్య అవసరాలను తీర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. అనంతరం బెల్జియం ట్రేడ్ కమిషనర్ జయంత్ నడిగర్‌ను ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

చిత్రం..చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో మాట్లాడుతున్న బెల్జియం
ట్రేడ్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్ డెవలప్‌మెంట్ కమిషనర్ జయంత్ నడిగర్