బిజినెస్

పెద్ద నోట్ల రద్దుతో ఎన్నో ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: పెద్ద నోట్ల రద్దు అనంతరం అప్రకటిత సొమ్ము రహస్యతను కోల్పోయిందని, దీంతో 91 లక్షల మంది పన్నుల వ్యవస్థ పరిధిలోకి వచ్చారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. న్యూఢిల్లీలో మంగళవారం ఆయన అక్రమ సంపదను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ పేరుతో ఏర్పాటు చేసిన కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ గత ఏడాది నవంబర్ 8వ తేదీన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా నగదు రహిత లావాదేవీలతో పాటు పన్ను చెల్లింపుదారుల సంఖ్య, పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతోందని ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం 91 లక్షల మంది పన్నుల వ్యవస్థ పరిధిలోకి వచ్చారని, పన్ను చెల్లింపుదారుల సంఖ్య మున్ముందు మరింత పెరుగుతుందని భావిస్తున్నానని జైట్లీ పేర్కొన్నారు. ఆదాయ వివరాలను ప్రకటించకుండా డిపాజిట్లు చేసిన 17.92 లక్షల మందిని గుర్తించడం జరిగిందని, వీరంతా పన్ను చెల్లింపుదారుల జాబితాలో లేరని, వీరిలో దాదాపు లక్ష మంది పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారని ఆయన చెప్పారు. అలాగే పెద్ద నోట్ల రద్దు తర్వాత పలువురు వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన రూ.16,398 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించినట్లు జైట్లీ తెలిపారు.