బిజినెస్

జోరుగా బుల్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 16: ద్రవ్యోల్బణ గణాంకాల సానుకూల సంకేతాలతో సోమవారం జీవనకాల గరిష్ఠ స్థాయికి చేరిన దేశీయ సూచీలు మంగళవారం మరింతగా ఎదిగి తమ రికార్డులను తామే బద్దలు కొట్టాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 250 పాయింట్లకు పైగా లాభపడి 30,582 పాయింట్ల సరికొత్త రికార్డుకు చేరుకోగా, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ దాదాపు 67 పాయింట్లు లాభపడి తొలిసారిగా 9,500 పాయింట్ల స్థాయిని దాటింది. ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటుగా రుతుపవనాలు మామూలుకన్నా ముందుగానే కేరళ తీరాన్ని తాకవచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో పాటుగా పలు కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలోనే ఉండడం కూడా మదుపరులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఫలితంగా మంగళవారం బలంగా ప్రారంభమైన సెనె్సక్స్ ఆ తర్వాత కొద్ది సేపటికే 30,591.55 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకినప్పటికీ చివరికి 260.48 పాయింట్లు లాభపడి 30,582. 60 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం ఒక దశలో 9,517.20 పాయింట్ల సరికొత్త గరిష్ఠస్థాయిని తాకినప్పటికీ చివరికి 66.85 పాయింట్లు లాభపడి 9,512.25 పాయింట్ల సరికొత్త రికార్డును సృష్టించింది. మంచి కార్పొరేట్ ఫలితాలు, రుతుపవనాలు ముందుగానే రావడం లాంటి కారణాలు మదుపరుల ఆందోళనలను దూరం చేశాయని, అయితే టెలికాం, ఐటి, ఫార్మా లాంటి నాన్‌పెర్ఫార్మింగ్ రంగాల ఆందోళనలు అలాగే ఉన్నాయని, అందువల్ల రాబోయే రోజుల్లో మార్కెట్లు ఆటుపోట్లకు గురయ్యే అవకాశం లేకపోలేదని నిపుణులు అంటున్నారు.
ఒక్క లోహాల రంగం తప్ప టెక్నాలజీ, ఎఫ్‌ఎంసిజి, ఐటి, ఆటో, వినియోగ వస్తువులులాంటి అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా సూచీలు లాభాల్లో ముగియగా, హాంకాంగ్, సింగపూర్, తైవాన్ మార్కెట్ల సూచీలు పడపోయాయి. ఐరోపా మార్కెట్లలో ప్రారంభంలో మిశ్రమ ధోరణి కనిపించింది. హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్‌టెల్, టిసిఎస్, ఐటిసి, ఎస్‌బిఐ, మారుతి, డాక్టర్ రెడ్డీస్, విప్రో, హెచ్‌యుఎల్ లాంటి కంపెనీల షేర్లు మంచి లాభాలు ఆర్జించాయి. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 21 కంపెనీలు లాభపడగా, కేవలం 9 నష్టపోయాయి.
ఎంఎస్‌సిఐ సూచీలో ఐఓసి, ఆర్‌ఇసి
ఇదిలా ఉండగా, ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి), రూరల్ ఎలక్ట్ఫ్రికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఇసి)లు ఎంఎస్‌సిఐ ఇండియా సూచీలో స్థానం పొందనున్నాయి. కాగా, దివీస్ లేబరేటరీస్ ఈ సూచీనుంచి వైదొలగనుంది. ఎంఎస్‌ఐసి గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌లలోని కంపెనీల్లో మార్పులను సోమవారం ప్రకటించగా, ఈ నెల 31న అమలులోకి రానున్నాయి. కొత్తగా 15 కంపెనీలను ఈ సూచీలో చేరుస్తుండగా, 11 కంపెనీలను తొలగించనున్నారు.