బిజినెస్

ఆర్‌ఐఎల్, జియోపై ఫిర్యాదు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా వెళ్తోందంటూ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), దాని సంచలన 4జి టెలికామ్ ఆపరేటర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌పై దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ చేసిన ఫిర్యాదును కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) శుక్రవారం కొట్టివేసింది. ఫిర్యాదును బలపరిచే ఎలాంటి సాక్ష్యాధారాలను, రుజువులను ఎయిర్‌టెల్ చూపించలేకపోయిందని, అందుకే దాని ఫిర్యాదును కొట్టివేస్తున్నామని తమ 17 పేజీల ఆదేశంలో సిసిఐ స్పష్టం చేసింది. జియో 4జి ఉచిత సేవలతో ఇప్పటికే ఎయిర్‌టెల్‌సహా, వొడాఫోన్, ఐడియా తదితర అన్ని టెలికామ్ సంస్థల ఆదాయం పడిపోయినది తెలిసిందే.