బిజినెస్

ఎస్‌సిఒ వ్యాపార మండలికి ఫిక్కీ ప్రాతినిథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) వ్యాపార మండలికి ఫిక్కీని భారతీయ వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఎస్‌సిఒ బిజినెస్ కౌన్సిల్‌లో ఇండియన్ ఇండస్ట్రీకి ఫిక్కీ ప్రాతినిథ్యం వహిస్తుందని ఫిక్కీ అధ్యక్షుడు పంకజ్ పటేల్ శుక్రవారం తెలియజేశారు. కాగా, రెండేళ్ల కృషి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాలకు శుక్రవారం ఎస్‌సిఒ పూర్తిస్థాయి సభ్యత్వం దక్కింది. కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో జరిగిన ఎస్‌సిఒ సదస్సులో మరిన్ని దేశాలకు నూతన సభ్యత్వం ఇచ్చారు. ఈ క్రమంలోనే భారత్, పాక్‌లూ సభ్యత్వాన్ని అందుకున్నాయి. చైనా ఆధిపత్యం కలిగిన ఎస్‌సిఒలో రష్యా, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కిర్గిస్తాన్ దేశాలకూ సభ్యత్వం ఉంది. ఇదిలావుంటే వాణిజ్యం, పెట్టుబడులు, సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆర్థిక సేవలు, అంతరిక్ష్యం, ఎస్‌అండ్‌టి, వ్యవసాయం, హెల్త్‌కేర్, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో భారత్‌కున్న సామర్థ్యం, అనుభవం ఇకపై ఎస్‌సిఒకు ఆర్థికంగా లాభించగలదని ఫిక్కీ అభిప్రాయపడింది. అంతేగాక భారతీయ ఉప ఖండానికీ ఎస్‌సిఒ విస్తరించినట్లైందని తెలిపింది. కాగా, ఆర్థికాభివృద్ధిపై ఎస్‌సిఒ దృష్టి పెట్టడంతో వ్యాపార మండలి.. ఎస్‌సిఒలో కీలక భూమిక పోషించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఎస్‌సిఒ సభ్య దేశాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రపంచ జనాభాలో 40 శాతానికిపైగా మందికి ఎస్‌సిఒ ప్రాతినిథ్యం వహిస్తుండగా, ప్రపంచ జిడిపిలో దాదాపు 20 శాతం వాటాను సొంతం చేసుకుంది.

చిత్రం.. శుక్రవారం కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో ఎస్‌సిఒ సభ్యులతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (ఎడమ), పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ (కుడి). చిత్రంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తదితరులున్నారు