బిజినెస్

మిషన్ భగీరథకు పన్నులు యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, కాకతీయ నీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులకు పన్ను మినహాయింపులు ఇచ్చేందుకు కేంద్రం సానుకులంగా లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన జిఎస్‌టి సమావేశం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి ఈటల హాజరైయ్యారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ఈటల మాట్లాడుతూ జిఎస్‌టిలో అనేక సూచనలు, మార్పులు, చేర్పులతో కూడిన ఒక పుస్తకాన్ని, ముఖ్యంగా 34 ప్రతిపాదనలను కేంద్రానికి అందించినట్టు ఆయన వెల్లడించారు. గతంలో కేంద్రానికి, రాష్ట్రానికి సంబంధించిన జిఎస్‌టిలో పన్నుల మినహాయింపులపై ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా కేంద్రానికి లేఖ రాశారని గుర్తుచేశారు. బొగ్గు ఆదారిత పరిశ్రమలకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. అలాగే సామాన్య ప్రజలు నిర్మించుకునే ఇండ్లపై పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరామన్నారు.
కాగా, జిఎస్‌టి రేటును మార్చకపోవడంపట్ల టెలికామ్ పరిశ్రమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. అలాగే ప్రింటర్లపై పన్నును 18 శాతానికి తగ్గించడంపట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే.. కంప్యూటర్ మానిటర్లపై, ప్రొజెక్టర్లపై 28 శాతం పన్ను విధించడంపట్ల విచారం వ్యక్తం చేసింది ఐటి హార్డ్‌వేర్ పరిశ్రమ. ఇక పన్ను శాఖ అధికారుల అధ్యయ నంలో ఆటో పరిశ్రమ డిమాండ్ సహేతుకంగా లేనందున హైబ్రిడ్ కార్లపై జిఎస్‌టి రేటును సమీక్షించబోమని జైట్లీ స్పష్టం చేశారు. మరోవైపు వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఒటిపి) ద్వారా జిఎస్‌టి రిజిస్ట్రేషన్ అప్లికేషన్‌ను వ్యాపారులు ఇ-వెరిఫై చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.