బిజినెస్

ఐఐపి, ద్రవ్యోల్బణం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: స్థూల ఆర్థిక గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్ష సమాచారం, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నిర్ణయాలూ కీలకమేనని పేర్కొంటున్నారు. వచ్చే నెల 1 నుంచి జిఎస్‌టి అమల్లోకి వస్తున్నది తెలిసిందే. జూలై 1 నుంచి ఈ పరోక్ష పన్నుల విధానం (జిఎస్‌టి) అమల్లోకి వస్తుండగా, 5, 12, 18, 28 శ్లాబుల్లో వివిధ రంగాలకు చెందిన దాదాపు అన్ని వస్తువులకు కేంద్రం పన్ను రేట్లను కేటాయంచింది. దీంతో దానికి ముందు పన్ను రేట్ల నిర్ణయాలు జరుగుతుండగా, వివిధ రంగాలు తమపై పన్నుల భారాన్ని తగ్గించాలని కోరుతున్నాయ. ఆదివారం జరిగిన సమావేశంలో కూడా 66 వస్తువులపై జిఎస్‌టి కౌన్సిల్ పన్నులను తగ్గించింది. దీని ప్రభావం కూడా మదుపరుల పెట్టుబడులపై ఉంటుందంటున్నారు మార్కెట్ విశే్లషకులు. కాగా, రికార్డుల మోత మోగిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం మాత్రం ఆ జోరు కనిపించలేదు. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 11.23 పాయంట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 14.75 పాయంట్లు పడిపోయాయ. సెనె్సక్స్ 31,262 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 9,668 వద్ద నిలిచింది. కాగా, సోమవారం మార్కెట్లు ముగిశాక ఏప్రిల్ నెలకుగాను పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) గణాంకాలు విడుదలవు తున్నాయ. ఇదే రోజున మే నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల కానుండగా, బుధవారం టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు వెల్లడవుతున్నాయ. అలాగే బుధవారమే అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష జరగనుంది. దీంతో వీటన్నిటి ఫలితాలు మార్కెట్ కదలికలను సహజంగానే శాసిస్తాయని మెజారిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.