బిజినెస్

రికార్డుస్థాయ కనిష్టానికి చిల్లర ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో రికార్డు స్థాయి కనిష్టానికి తగ్గింది. మే నెలలో 2.18 శాతంగా నమోదైనట్లు సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) తెలియజేసింది. కూరగాయలు, పప్పు్ధన్యాలు తదితర కీలక ఆహారోత్పత్తుల ధరలు దిగిరావడం వల్లే వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. అంతకుముందు నెల ఏప్రిల్‌లో 2.99 శాతంగా ఉండగా, నిరుడు మే నెలలో 5.76 శాతంగా ఉంది. కాగా, ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిస్తే పంటలు బాగా పండి ఆహారోత్పత్తుల ధరలు మరింత తగ్గడం ఖాయమన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే ఆహార ద్రవ్యోల్బణం భారీగా తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఇక తాజా గణాంకాలు ద్రవ్యోల్బణంపట్ల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకున్న అభిప్రాయాన్ని బలపరిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్లను తగ్గించాలని, తద్వారా దేశంలో పెట్టుబడులకు ఊతమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంటున్నది తెలిసిందే. ద్రవ్యోల్బణం తగ్గడంతో ఆర్థిక మంత్రిత్వ శాఖతోపాటు వ్యాపార, పారిశ్రామిక రంగాలు సైతం వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ తగ్గించాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాయ.