బిజినెస్

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 29: తీవ్ర ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 3.52 శాతం పెరిగి 25,606.62 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 2.55 పాయింట్లు అందుకుని 7,849.80 వద్ద నిలిచింది. గురువారం సూచీలు భారీ నష్టాలకు లోనైన నేపథ్యంలో శుక్రవారం ఆరంభంలోనూ నష్టాలతోనే మొదలయ్యాయి. అయితే సమయం గడుస్తున్నకొద్దీ మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరచడంతో స్వల లాభాలనైనా అందుకోగలిగాయి. ఇక రియల్టీ, విద్యుత్, హెల్త్‌కేర్, మెటల్, చమురు, గ్యాస్, బ్యాంకింగ్ రంగాల షేర్ల విలువ 1.18 శాతం నుంచి 0.33 శాతం పెరిగింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ సూచీ 0.22 శాతం లాభపడితే, స్మాల్-క్యాప్ సూచీ 0.05 శాతం మేర నష్టపోయింది. మరోవైపు అంతర్జాతీయంగా ఆసియా, ఐరోపా మార్కెట్లు నష్టాల్లో కదలాడాయి.