బిజినెస్

40 బిలియన్ డాలర్లతో భారీ చమురుశుద్ధి కర్మాగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఐఒసి, బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్.. మహారాష్టల్రోని రత్నగిరి జిల్లాలో 40 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద చమురుశుద్ధి, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను సంయుక్తంగా ఏర్పాటుచేసేందుకు బుధవారం ఓ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ప్లాంట్‌లో ఐఒసికి 50 శాతం, మిగతా 50 శాతం వాటా బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్‌కు ఉంటుంది. ఇదిలావుంటే రోజువారి ధరల మార్పు విధానంపై పిలుపునిచ్చిన సమ్మెను పెట్రోల్ బంక్ యాజమాన్యాలు బుధవారం ఉపసంహరించుకున్నాయి. ధరల మార్పు అర్ధరాత్రికి బదులుగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సవరించడంతో సమ్మె విరమణ జరిగింది. శుక్రవారం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.