బిజినెస్

విజయ్ మాల్యాపై ఈడి చార్జిషీటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 14: లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాపై బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) తమ తొలి చార్జీషీటును దాఖలు చేసింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ-కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణం కేసులో మనీ లాండరింగ్ విచారణతో సంబంధమున్న మరికొందరిపైనా చార్జిషీటు నమోదు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం క్రింద నిరుడు ఈడి క్రిమినల్ కేసును నమోదు చేసినది తెలిసిందే. ఇప్పటిదాకా ఈ కేసులో 9,600 కోట్ల రూపాయలకుపైగా విలువైన ఆస్తులనూ ఈడి జప్తు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 400 కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోయాయని 57 పేజీల చార్జీషీటు లేదా విచారణ ఫిర్యాదులో ఈడి పేర్కొంది. మరోవైపు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా.. తనపై భారతీయ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు. ‘బ్రిటన్ కోర్టులో భారత ప్రభుత్వం కేసు దాఖలు చేసింది. కనీసం తీర్పు వచ్చేవరకైనా ఆగండి’ అంటూ ట్వీట్ చేశారు.