బిజినెస్

సింగరేణికి సమ్మెపోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూన్ 15: వారసత్వ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా సింగరేణి కాలరీస్ సంస్థలో గురువారం సమ్మె ప్రారంభమయింది. ఐదు జాతీయ కార్మిక సంఘాలతోపాటు విప్లవ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనటంతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న భూగర్భ గనులు వెలవెలబోతుండగా, ఓపెన్ కాస్ట్‌లలో మాత్రం కార్మికులు విధులకు హాజరవుతున్నారు. సింగరేణి యాజమాన్యం 40 శాతం మంది కార్మికులు విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించినప్పటికీ సమ్మె విజయవంతమైందని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి ఆరు జిల్లాలకు విస్తరించి ఉన్న సింగరేణిలో కార్మికులు సమ్మెలో భాగస్వాములయ్యారు. గురువారం మొదటి షిఫ్టులో మణుగూరులో 80 శాతం, కొత్తగూడెం, ఇల్లందులలో 40 శాతం మంది కార్మికులు విధుల్లో పాల్గొన్నారు. సమ్మె సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓపెన్‌కాస్ట్‌ల వద్ద పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు.