బిజినెస్

గుంటూరులో ఐటిసి ఫైవ్‌స్టార్ హోటల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 29: ఆంధ్ర రాష్ట్రంలో విశాలమైన సముద్రతీర ప్రాంతంతో పాటు, ప్రసిద్ధిచెందిన దేవాలయాలు ఉన్నాయని, వీటిని అభివృద్ధి చేస్తూనే పర్యాటక రంగానికి ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరు నగరంలో ఐటిసి ఐదు నక్షత్రాల హోటల్ నిర్మాణ పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీలంక తరహా ఎపిలో టూరిజం అభివృద్ధి చెందేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, పర్యాటక రంగాభివృద్ధిలో తమ సహాయ సహకారాలు అందించేందుకు ఐటిసి ముందుకు రావాలన్నారు. వ్యవసాయాధారిత పరిశ్రమలు, టెక్స్‌టైల్స్, సిమెంటు పరిశ్రమలను నెలకొల్పేందుకు రాజధాని ప్రాంతం అనువుగా ఉందని చెప్పారు. స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నారని, గుంటూరు అమరావతిలో అంతర్భాగమని అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాలను రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. సేవల రంగం ద్వారా వృద్ధిరేటు సాధ్యపడుతుందన్న బాబు.. రానున్న రెండేళ్లలో టూరిజంతోపాటు ఆధ్యాత్మిక కేంద్రాలకు పర్యాటకులను ఆకర్షించే విధంగా ఐటిసి పెట్టుబడులు పెట్టాలని కోరారు. గుంటూరు పొగాకు ఎగుమతులకు ఐటిసి కేంద్రంగా ఉందని, కాబట్టి ఐటిసి సంస్థ వ్యవసాయాధారిత ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు సహకరించాలన్నారు. కాగా, రాష్ట్రంలో రొయ్యల పరిశ్రమ ద్వారా 30 శాతం ఆదాయం వస్తుందని, ప్రపంచంలో రొయ్యల ఎగుమతుల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలపాలన్నదే తమ ధ్యేయమన్నారు. ఐటిసి చైర్మన్ వైసి దేవేశ్వర్ మట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ సిద్ధంగా ఉందని, ఇందులో భాగంగానే గుంటూరు నగరంలో ఫైవ్ స్టార్ హోటల్ (మై ఫార్చ్యున్)ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో అమరావతిలో కూడా ఇదే తరహా నిర్మాణాలు, పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఐటిసి సంస్థ ప్రధానంగా వ్యవసాయ రంగం, సర్వీసెస్, ఉత్పత్తి రంగాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తుందన్నారు. కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఎంపి గల్లా జయదేవ్, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, ఎమ్మెల్సీ రామకృష్ణ, ఎమ్మెల్యేలు, ఐటిసి అధికారులు పాల్గొన్నారు.

శుక్రవారం గుంటూరు నగరంలో ఐటిసి ఐదు నక్షత్రాల హోటల్ నిర్మాణ పనులకు
శంకుస్థాపన చేసిన ఎపి సిఎం చంద్రబాబు నాయుడు. చిత్రంలో స్పీకర్ కోడెల, మంత్రి రావెల,
ఎంపి గల్లా జయదేవ్, ఐటిసి చైర్మన్ వైసి దేవేశ్వర్‌ను చూడవచ్చు