బిజినెస్

జోరుగా ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: దేశీయ ఎగుమతులు గత నెలలో 8.32 శాతం పెరిగాయి. మే నెలలో 24.01 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. నిరుడు మే నెలలో 22.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయ. పెట్రోలియం, కెమికల్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు పుంజుకున్నాయి.
అలాగే రత్నాలు, ఆభరణాల ఎగుమతులూ పెరిగాయి. మరోవైపు దిగుమతులు కూడా 33.09 శాతం ఎగిసి 37.85 బిలియన్ డాలర్లను తాకాయి. దీంతో వాణిజ్య లోటు 13.84 బిలియన్ డాలర్లుగా నమోదవగా, ఏకంగా 30 నెలల గరిష్ఠాన్ని తాకింది. బంగా రం దిగుమతులు మూడింతలు అధికమై 4.95 బిలియన్ డాలర్లకు చేరాయి. కాగా, మున్ముందు ఎగుమతులు మరింత పెరగగలవన్న ఆశాభావాన్ని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఇఒ) వ్యక్తం చేసింది.
పెరిగిన కరెంట్ ఖాతా లోటు
ఇదిలావుంటే గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో కరెంట్ ఖాతా లోటు (సిఎడి) 3.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి- మార్చిలో ఇది 0.3 బిలియన్ డాలర్లుగానే ఉంది. ఫారెక్స్ ఆదాయ, వ్యయాల మధ్యగల తేడానే కరెంట్ ఖాతా లోటుగా పరిగణిస్తారన్నది తెలిసిందే. కరెంట్ ఖాతా లోటును తగ్గించడానికి కేంద్రం దిగుమతులపై సుంకాలను పెంచుతుంది.