బిజినెస్

ప్రపంచ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 60వ స్థానంలో నిలిచిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: ప్రపంచ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2017లో భారత్.. నిరుడుకన్నా తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకొని 60వ స్థానానికి చేరింది. 130 దేశాలున్న ఈ జాబితాలో భారత్ నిరుడు 66వ స్థానంలో ఉండగా, ఈ సారి 60వ స్థానానికి చేరుకొంది. ఫలితంగా మధ్య, దక్షిణాసియాలో టాప్ ర్యాంక్ పొందిన దేశంగా నిలిచింది. కాగా, స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, అమెరికా, బ్రిటన్‌లు అత్యంత ఇన్నోవేటివ్ దేశాలుగా తమ టాప్ స్థానాలను నిలబెట్టుకున్నాయి. మరోవైపు చైనా ఈ జాబితాలో 22వ స్థానంలో నిలిచింది. చైనాకన్నా ఎంతో వెనకబడి ఉన్నప్పటికీ ఆసియాలో భారత్ ప్రముఖ ఇన్నోవేటివ్ కేంద్రంగా తయారవుతోందని కార్నెల్ యూనివర్శిటీ, ఇన్‌సీడ్, వరల్డ్ ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా రూపొందించిన ఈ సూచీని బట్టి అర్థమవుతోంది. కాగా, 2015లో 81వ స్థానంలో ఉండిన భారత్ క్రిందటేడాది 66వ స్థానానికి చేరుకోవడం ద్వారా తన స్థానాన్ని ఎంతో మెరుగుపర్చుకొందని, వరసగా అయిదేళ్ల పాటు ర్యాంకింగ్ పడిపోయిన తర్వాత ఈ మెరుగుదల చోటు చేసుకుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. నూతన ఆవిష్కరణలు, సృజనాత్మకతల విషయంలో సమున్నత శిఖరాలకు చేరుకోగల భారత దేశ సత్తాను గుర్తించి ప్రభుత్వం.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఇన్నోవేషన్‌పై ఒక టాస్క్ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆ అధికారిక ప్రకటన పేర్కొంది. భారత దేశం ఎదుగుదల చాలా పొరుగు దేశాలకు సైతం ప్రయోజనకరమని కూడా ఆ ప్రకటన పేర్కొంది. కాగా, మన పొరుగు దేశాల్లో శ్రీలంక 90వ స్థానంలో ఉండగా, నేపాల్ 109, పాకిస్తాన్ 113వ స్థానంలో నిలిచాయి. వరసగా ఏడో సంవత్సరం కూడా స్విట్జర్లాండ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అధిక ఆదాయాలు కలిగిన దేశాలు ఈ జాబితాలోని తొలి 25 స్థానాల్లో 24 స్థానాలను సొంతం చేసుకోగా, మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థల్లో చైనా ఒక్కటే టాప్ 25లో స్థానం పొందింది. పేటెంట్లు దాఖలు చేయడం మొదలుకొని విద్యా రంగంపై చేస్తున్న ఖర్చు, దేశ ఆర్థిక, సామాజిక వృద్ధికి దోహదపడే ప్రభుత్వాలు తీసుకునే వినూత్న కార్యక్రమాలపై నిర్ణయాల వంటి వివిధ అంశాల ఆధారంగా 130 దేశాలలో సర్వేలు నిర్వహించి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ను రూపొందిస్తారు.