బిజినెస్

మార్కెట్‌లో జిఎస్‌టి ఆఫర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: మార్కెట్‌లో జిఎస్‌టి ఆఫర్లు పోటెత్తాయి. వచ్చే నెల 1 నుంచి వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి వస్తున్న క్రమంలో వినియోగదారులను ఆకట్టుకునే పనిలోపడ్డారు దుకాణదారులు. ఆ వస్తువు, ఈ వస్తువు అని తేడా లేకుండా అన్నింటిపైనా డిస్కౌంట్లు దర్శనమిస్తున్నాయిప్పుడు. కార్లు, ఎయిర్ కండీషనర్లు, టెలివిజన్లు, స్మార్ట్ఫోన్లు, వాషింగ్ మెషీన్లు, పాదరక్షలు, వస్త్రాలు ఇలా.. అన్నింటి ధరలు తగ్గాయి మరి. అవును.. జూలై 1 నుంచి కొత్త పరోక్ష పన్నుల విధానం రానుండటంతో తమ దుకాణాల్లోని వస్తు నిల్వలను తగ్గించుకుంటే న్యాయపరమైన నిబంధనలకు లోబడినట్లవుతుందని, అంతేగాక జిఎస్‌టికి అనుగుణంగా పన్ను చెల్లింపులు, ధరల మార్పు వంటి ఇతరత్రా పనులూ తగ్గుతాయని ఆయా షాపుల యజమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఊరికే షాపుల్లో పెట్టుకుని వాటిపై జిఎస్‌టి చెల్లించేకంటే ధరలు తగ్గించి కస్టమర్లకు ఇస్తే సంస్థ బ్రాండ్ ఇమేజ్ అయినా పెరుగుతుందని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే రిటైలర్లు, హోల్‌సేల్ వ్యాపారులు ఈ 15 రోజుల్లో వీలైనంత ఎక్కువ వ్యాపారాన్ని చేసుకోవాలని చూస్తున్నారు. అందులోభాగంగానే ధరల తగ్గింపునకు నాంది పలుకుతున్నారు.
ఇప్పటికే ఆటో రంగం ఈ విషయంలో ముందుంది. వివిధ సంస్థలు తమ కార్ల ధరలను 10,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల మేర తగ్గించాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా, నిస్సాన్, మహీంద్ర అండ్ మహీంద్ర, ఫోర్డ్ ఇండియా సంస్థలు వివిధ ఆఫర్లతో ముందుకొచ్చాయి. దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకి తమ కార్ల ధరలను 25,000 రూపాయల నుంచి 35,000 రూపాయల మేర తగ్గించింది. మహీంద్ర అండ్ మహీంద్ర సైతం 27,000 రూపాయల నుంచి 90,000 రూపాయల వరకు దించింది. హ్యుందాయ్ అయితే ఏకంగా 25,000 రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు డిస్కౌంట్ ఇచ్చింది. అలాగే హోండా కార్స్ 14,500 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫోర్డ్ ఇండియా 30,000 రూపాయల వరకు, నిస్సాన్ 80,000 రూపాయల వరకు తగ్గించాయి. లగ్జరీ కార్లైన బిఎమ్‌డబ్ల్యు, ఆడీ, బెంజ్, జాగ్వార్ లాండ్ రోవర్ ధరలూ జిఎస్‌టి కారణంగా భారీగానే దిగివచ్చాయి. ఆడీ కార్ల ధర 10 లక్షల రూపాయలు తగ్గగా, బిఎమ్‌డబ్ల్యు కూడా భారీగానే ధరను తగ్గిస్తున్నట్లు చెప్పింది. మెర్సిడెస్ బెంజ్ కూడా 7 లక్షల రూపాయల వరకు తమ కార్ల ధరలను తగ్గిస్తున్నామంది. ఇక టాటా మోటార్స్ లగ్జరీ కార్ల బ్రాండైన జాగ్వార్ లాండ్ రోవర్ ధర 10.9 లక్షల రూపాయల వరకు తగ్గింది. ఇప్పటికే టూవీలర్ సంస్థలైన రాయల్ ఎన్‌ఫీల్డ్, బజాజ్ ఆటో తమ వాహనాల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. జూన్ 30 వరకు ఆఫర్లు వర్తిస్తాయని ప్రకటించాయి. జిఎస్‌టి రేట్ల ప్రకారం 1,200 సిసి సామర్థ్యానికి తక్కువగా ఉన్న ఇంజిన్ కలిగిన చిన్న పెట్రోల్ ఆధారిత కార్లపై ఒక శాతం సెస్సు, 1,500 సిసికి తక్కువగా ఉన్నవాటిపై 3 శాతం సెస్సు పడుతుంది. ఆపై సామర్థ్యం కలిగిన ఇంజిన్లున్న స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్స్ (ఎస్‌యువి)పై 15 శాతం సెస్సు పడుతుంది. వాహనం పొడవు 4 మీటర్లకుపైగా ఉన్నా.. ఇంతే సెస్సు వర్తిస్తుంది.
ఇదిలావుంటే పేటిఎమ్ మాల్.. ప్రీ-జిఎస్‌టి సేల్ ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్ 7, ఇతరత్రా వస్తువులపై భారీగా ధరలను తగ్గించింది. డిఎస్‌ఎల్‌ఆర్‌పై 20,000 రూపాయలు, ల్యాప్‌ట్యాప్‌లపై 15,000 రూపాయలు, ఎల్‌ఇడి టెలివిజన్లపై 10,000 రూపాయల వరకు ధరలను దించింది. ఐఫోన్లపై 7,000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఎయిర్ కండీషనర్లపై 8,000 రూపాయల క్యాష్‌బ్యాక్, రిఫ్రిజిరేటర్లపై 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఇచ్చింది. ఇవేగాక ల్యాప్‌ట్యాప్‌లు, బ్లూటూత్, స్పీకర్లు, పాదరక్షలు, ఇతరత్రా వస్తువుల కొనుగోళ్లపై 50 శాతం డిస్కౌంట్, అదనంగా 25 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. పవర్ బ్యాంక్‌లపైనైతే 70 శాతం డిస్కౌంట్, గేమింగ్ కన్సోల్స్‌పై 6,000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఇచ్చింది. అయితే మూడు రోజులపాటే అమల్లో ఉండే ఈ ఆఫర్లు గురువారంతో ముగిశాయి.
వస్త్ర వ్యాపారులు సైతం తమ వద్ద పేరుకుపోయిన నిల్వలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. లెవీస్, రెబాక్, వుడ్‌లాండ్ తదితర బ్రాండెడ్ దుస్తులు, పాదరక్షల తయారీ సంస్థలు భారీగా ఆఫర్లను ప్రకటించాయి. మల్టీబ్రాండ్ రిటైల్ సంస్థ ఫ్యూచర్ గ్రూప్ కూడా వివిధ వస్తువులపై డిస్కౌంట్లను తెచ్చింది. మొత్తానికి జిఎస్‌టి ఆఫర్లు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.