బిజినెస్

వచ్చేవారం కేబినెట్ ముందుకు హెచ్‌ఆర్‌ఎ అంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: వచ్చే వారం కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం.. 7వ వేతన సంఘం సిఫార్సులపై దృష్టి పెట్టనుంది. హెచ్‌ఆర్‌ఎ తదితర అలవెన్సుల ప్రతిపాదనలపై చర్చించనుందని నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ (ఎన్‌జెసిఎ) కన్వీనర్ శివ్ గోపాల్ మిశ్రా ఓ ప్రముఖ జాతీయ వార్తా చానెల్‌తో చెప్పారు. 7వ వేతన సంఘం సిఫార్సు చేసినదానికంటే కూడా ఎక్కువ హెచ్‌ఆర్‌ఎ లేదా హౌస్ రెంట్ అలవెన్సులకు మోదీ సర్కారు ఆమోదం తెలిపే వీలుందన్నారు. నిజానికి బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగినప్పటికీ, అందులో ఉద్యోగులకు సంబంధించిన అలవెన్సులపై 7వ వేతన సంఘం చేసిన సిఫార్సులు చర్చకు రాలేదు.
ఇందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ దక్షిణ కొరియా పర్యటన కూడా ఓ కారణంగా తెలుస్తోంది. కాగా, కేబినెట్ నిర్ణయంతో దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.