బిజినెస్

‘4 ట్రిలియన్ డాలర్లకు దేశ డిజిటల్ ఎకానమీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: రాబోయే నాలుగేళ్లలో భారత డిజిటల్ ఎకానమీ సామర్థ్యం 4 ట్రిలియన్ డాలర్లకు చేరనుందని శుక్రవారం టెక్నాలజీ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి తెలిపాయి. 2022 నాటికి దేశ డిజిటల్ ఎకానమీ 1 ట్రిలియన్ డాలర్లను తాకుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్న క్రమంలో దాన్ని అధిగమించి 4 ట్రిలియన్ డాలర్లకు వెళ్తుందన్నారు ప్రముఖ టెక్కీలు. కేంద్ర ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ అధ్యక్షతన దేశీయ ఐటి, టెక్నాలజీ సంస్థల అధిపతులు ఇక్కడ సమావేశమయ్యారు. నాస్కామ్, గూగుల్ ఇండియా, విప్రో, ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్, నీట్, హైక్ మెసేంజర్, ఫ్లిప్‌కార్ట్, పేటిఎమ్ తదితర సంస్థల చైర్మన్లు, అధ్యక్షులు, సిఇఒలు, వ్యవస్థాపకులు సమావేశానికి హాజరైయ్యారు.