బిజినెస్

శక్తిమాన్ ఆగ్రో కంపెనీకి 200 ఎకరాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: వ్యవసాయ యంత్రాల తయారీలో అంతర్జాతీయంగా పేరుపొందిన శక్తిమాన్ ఆగ్రో కంపెనీ.. తెలంగాణ రాష్ట్రంలో కర్మాగారం స్థాపనకు ముందుకు వచ్చింది. శుక్రవారం పరిశ్రమ భవన్‌లో టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లుతో శక్తిమాన్ ఆగ్రో కంపెనీ చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ దినేష్ వశిష్ట సమావేశమయ్యారు. మానవ వనరుల విభాగం ఎవిపి సుగునాకర్ రావు, సేల్స్ అండ్ మార్కెటింగ్ జోనల్ మేనేజర్ ఎన్ శివనాగ ప్రసాద్ ప్రభృతులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చి. రైతులకు లబ్ది చేకూరేలా ఆధునిక సాగు యంత్రాలను తయారు చేస్తున్నామని దినేష్ వశిష్ట బాలమల్లుకు వివరించారు. ప్రస్తుతం 71 దేశాల్లో తమ సంస్థకు చెందిన యూనిట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. కాగా, తెలంగాణలో శక్తిమాన్ కంపెనీ స్థాపనకు 200 ఎకరాల వరకు భూములను కేటాయంచే ప్రతిపాదనలు తమ పరిశీలనలో ఉన్నాయని టిఎస్‌ఐ ఐసి చైర్మన్ బాలమల్లు అన్నారు. అయతే సిరిసిల్ల జిల్లా జిల్లెలలో భూములను సంస్థ ప్రతినిధులకు చూపించామని, అక్కడ 200 ఎకరాలిచ్చేందుకు ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకరించిందని టిఎస్‌ఐఐసి ఎండి నర్సింహారెడ్డి వెల్లడిం చారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోనూ సంస్థ ప్రతినిధులకు భూములను చూపించామని ఆయన పేర్కొన్నారు.