బిజినెస్

పారిశ్రామిక తెలంగాణ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: వచ్చే ఆరు నెలల కాలంలో పలు భారీ పరిశ్రమల ఏర్పాటు కోసం తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రణాళిక రూపొందించింది. సాధారణ ఎన్నికలకు మరో 21 నెలల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పరిశ్రమల స్థాపన ద్వారా పాజిటివ్ సంకేతాలు పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలిసారిగా హైదరాబాద్ బయట ఐటి పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లాలో ఐటి పార్క్‌కు కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఇదే తరహాలో వరంగల్ జిల్లాలో ఒక ఐటి పార్క్ ఏర్పాటు చేయనున్నారు. కేవలం హైదరాబాద్‌కే పరిశ్రమలను పరిమితం చేయకుండా రెండవ శ్రేణి నగరాల్లో సైతం ఐటి కంపెనీల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రాయితీలు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఖమ్మంలో దీనికి నాంది పలికింది. వరంగల్‌లో సైతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే విధంగా మిగిలిన జిల్లాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. ఇందులోభాగంగానే సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లో 250 ఎకరాల్లో మెడికల్ డివైజెస్ పార్క్‌ను శనివారం ప్రారంభించారు. మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 250 ఎకరాల్లో నెలకొల్పే ఈ పార్క్‌లో తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు పలు కంపెనీలు ఇప్పటికే ముందుకు వచ్చాయి. ప్రారంభోత్సవం రోజునే పది కంపెనీలతో ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది. అదే విధంగా త్వరలోనే యాదాద్రి జిల్లా దండు మల్కాపురంలో కూడా ఇండస్ట్రీయల్ పార్క్‌ను నాలుగు వందల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇక వరంగల్ జిల్లాలోనైతే 12 వందల ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం రోజునే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో ఒప్పందాలు చేసుకుంటారు. భూములను కూడా కేటాయిస్తారు. మరోవైపు అక్టోబర్‌లో ఫార్మాసిటీ మొదటి దశ ప్రారంభిస్తారు. మొదటి దశ కోసం 8,200 ఎకరాల భూమి అవసరం అవగా, ఇప్పటివరకు 6,300 ఎకరాల భూమిని సేకరించారు. సిద్దిపేట జిల్లాలో కూడా సీడ్ పార్క్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూ సేకరణ పూర్తి చేశారు. జనగామ, సిరిసిల్ల, ఖమ్మం జిల్లాల్లోనూ మూడు ఫుడ్ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం జిల్లా బుగ్గపాడులో ఫుడ్ పార్క్‌ను ఇటీవలే ప్రారంభించినది తెలిసిందే. నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని భీమ్‌గల్‌లో సుగంధ ద్రవ్యాల సాగుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేగాక రంగారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్ పార్క్, సిద్దిపేట జిల్లాలో గ్రానైట్ క్లస్టర్, వికారాబాద్, మిర్యాలగూడలలో ఆటో నగర్‌లను ఏర్పాటు చేస్తారు. సిరిసిల్లలో వస్త్ర సంబంధిత పార్క్, గద్వాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో హ్యాండ్లూమ్ క్లస్టర్‌లను ఏర్పాటు చేస్తారు. నల్లగొండ జిల్లా పరిధిలో డ్రై పోర్టు ఏర్పాటు అవుతోంది. వచ్చే ఆరు నెలల్లో ఈ పరిశ్రమలు ప్రారంభం అయ్యే విధంగా పరిశ్రమల శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మొత్తానికి వ్యాపార, పారిశ్రామిక రంగాలకు హైదరాబాద్‌నే కేంద్రంగా చేయకుండా, మొత్తం తెలంగాణనే కేంద్రంగా చేయాలనే సంకల్పంతో కెసిఆర్ సర్కారు ముందుకెళ్తోంది. తద్వారా తెలంగాణలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, వలసలు కూడా తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని భావిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు త్వరితగతిన ప్రభుత్వ అనుమతు లు వచ్చేలా విధివిధానాలను రూపొందిస్తున్న కెసిఆర్.. టిఎస్‌ఐపాస్ వంటి పారదర్శకమైన విధానాన్ని పరిచయం చేసినది తెలిసిందే. అలాగే పెద్ద ఎత్తున భూ కేటాయంపులను జరుపుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు కోరుకున్న చోట వంద లాది ఎకరాలను ఇచ్చేందుకూ వెనుకాడటం లేదు. ముఖ్యంగా ఆయా ప్రాంతాలకు అనువైన పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు. చేనేత, గ్రానైట్, సిమెంట్ తదితర పరిశ్రమ లను ఇలాగే నెలకొల్పేలా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.