బిజినెస్

జిఎస్‌టి వాయిదా వేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలును వాయిదా వేయాలని వ్యాపార, పారిశ్రామిక సంఘం అసోచామ్.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసింది. ఐటి నెట్‌వర్క్ ఇంకా సిద్ధం కాలేదని, పన్ను చెల్లింపుదారులు ఈ కొత్త పరోక్ష పన్నుల విధానం క్రింద ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడం కష్టతరంగా ఉంటుందని అందులో పేర్కొంది. ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను నినాదంతో వచ్చే నెల 1 నుంచి జిఎస్‌టి అమలుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సన్నద్ధమవుతున్నది తెలిసిందే. అయితే ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నుల కంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తున్న వ్యాపార, పారిశ్రామిక రంగాలు మాత్రం జిఎస్‌టిని వ్యతిరేకిస్తున్నాయి. ఇందులోభాగంగానే దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నాయి. వీటిలో వస్త్ర, ఆభరణాల పరిశ్రమలే అధికంగా ఉన్నాయి. ఇకపోతే దేశం మొత్తం మీద ప్రస్తుతం దాదాపు 80 లక్షల ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ మదింపుదారులున్నారని, ఇందులో 64.35 లక్షల మంది ఇప్పటికే జిఎస్‌టి నెట్‌వర్క్ పోర్టల్‌ను అందిపుచ్చుకున్నాయని అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ తెలిపారు. కాగా, జిఎస్‌టి మైగ్రేషన్ విండో ఈ నెల 15న మూతపడగా, 25న మళ్లీ తెరుచుకోనుంది. ఈ క్రమంలో ఐటి నెట్‌వర్క్ పూర్తిగా అందరికీ అందుబాటులోకి రాలేదని, కాబట్టి జిఎస్‌టి అమలును వాయిదావేస్తే వ్యాపారులకు ఉపయుక్తంగా ఉంటుందని అసోచామ్ కోరుతోంది.