బిజినెస్

చంద్రన్న రైతు క్షేత్రాల్లో జలపుష్పాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 18: కేవలం వ్యవసాయ రంగం కోసమే ప్రవేశపెట్టిన చంద్రన్న రైతు క్షేత్రాలు ఇప్పుడు ఆక్వా రంగానికి అండగా నిలువనున్నాయి. అన్నదాతలు మాదిరిగా ఆక్వా రైతులు ఆర్థిక ఇబ్బందులతో సమమతమవుతున్నారు. ప్రతీసారి పంట చేతికి వచ్చే సమయంలో వాతావరణంలో వచ్చిన మార్పులు, వైరస్ తదితర కారణాల వల్ల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. దీంతో వారికి వెన్నుదన్నుగా ఉండేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రన్న రైతు క్షేత్రాల్లో సముద్ర ఉత్పత్తుల పెంపకాన్నీ చేర్చి, రాయితీలు ఇచ్చి మరింత ప్రోత్సాహాన్ని అందివ్వాలని నిర్ణయించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిపిన ప్రయోగం సత్ఫలితాలివ్వడంతో రాష్ట్రంలోని మిగిలిన తీరప్రాంత జిల్లాలకు విస్తరించనున్నారు. ప్రస్తుతం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా దేశానికి ఏటా సుమారు 85 వేల కోట్ల రూపాయలు వస్తుంటే అందులో 20 వేల కోట్ల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లా నుంచే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సముద్ర ఉత్పత్తుల పెంపకానికి మరింత అవకాశమున్న పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని సముద్ర తీర ప్రాంతమైన భీమవరం, నరసాపురం, కాళ్ళ, మొగల్తూరు, యలమంచిలి ప్రాంతాల్లో రాష్ట్ర మత్స్యశాఖ ద్వారా ఈ ప్రయోగాలు చేపట్టి మంచి ఫలితాలను సాధించింది. దీంతో ఈ పథకాన్ని రాష్ట్రంలోని మిగిలిన తీర ప్రాంత జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకంలో చంద్రన్న రైతు క్షేత్రం ద్వారా పేర్లను నమోదు చేసుకున్న వారికి ప్రోబయోటిక్ మందులను ఉచితంగా అందిస్తారు. సాగులో ఉపయోగపడే మేతల ధరలో 20 శాతం రాయితీ అందిస్తారు. ఇక చేపల విషయానికి వస్తే వాటి ఉత్పత్తిని ఈ క్షేత్రాల ద్వారా రెట్టింపు చేస్తారు. కొత్తరకాలను ఈ క్షేత్రాల ద్వారా పెంపకం చేయిస్తారు. పీతల పెంపకందార్లకు చెన్నైలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ నుంచి నాణ్యమైన పిల్లలను పంపిణీ చేస్తారు. ప్రస్తుతం చెరువుల్లో సాగు చేస్తున్నట్లు కాకుండా ప్రత్యేకంగా పెట్టెల్లో ఉంచి పెంచే విధానాన్ని అమలు చేయిస్తారు. చెరువుల్లో పీతలను పెంచడం వల్ల అవి గుల్ల విడిచే సమయంలో కొన్ని బలహీనంగా ఉంటున్నాయి. వాటిని బలంగా ఉన్న పీతలు తినేస్తుంటాయి. దీని వల్ల రైతు దిగుబడిని కోల్పోతున్నారు. అదీకాకుండ పీతలు చెరువు గట్లను బొరియలు చేసి బయకు పారిపోతుంటాయి. పెట్టెల పద్దతిలో ఈ సమస్యలను అధిగమించి దిగుబడులను పెంచుకోవచ్చు. మరోవైపు మంచి ధర, డిమాండు ఉన్న పండుగప్ప సాగుచేసే రైతులకు చంద్రన్న రైతు క్షేత్రం పథకం ద్వారా మంచి రోజులు వచ్చాయి. గతంలో పండుగప్ప సీడ్‌కు రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు నాణ్యమైన పిల్లలను చెన్నై నుంచి తెచ్చుకోవచ్చు. దీనికి మత్య్సశాఖ ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
పీత, పండుగప్పపై ప్రత్యేక దృష్టి
చంద్రన్న రైతు క్షేత్రాల ద్వారా అన్నిటికంటే పీత, పండుగప్ప పెంపకంపై ప్రత్యేకదృష్టి సారించనున్నారు. ప్రస్తుత పరిస్దితుల్లో కొన్ని రకాల, చేపలు, రొయ్యలు దేశీయంగా డిమాండుతోపాటు, విదేశాలకు ఎగుమతులు అవుతున్నాయి. అయితే చేపల్లో రారాజుగా ఉన్న పండుగప్ప, సముద్ర ఉత్పత్తుల్లో అత్యంత రుచికరంగా ఉండే పీత దిగుబడి చాలా తక్కువగా ఉంది. రాష్ట్రంలో అతి తక్కువ సాగు జరుగుతున్నవి ఇవే. దీంతో వీటికి దేశీయ, అంతర్జాయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. దీంతో వీటిపై ప్రత్యేక దృష్టిసారించి పెంపకానికి ప్రోత్సాహాన్ని అందించనున్నారు.