బిజినెస్

జిఎస్‌టి రిటర్న్ ఫైలింగ్‌కు వెసులుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రిటర్న్ ఫైలింగ్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. జూలై 1 నుంచే జిఎస్‌టి అమల్లోకి వస్తుందన్న జిఎస్‌టి కౌన్సిల్.. జిఎస్‌టి రిటర్న్ ఫైలింగ్‌కు రెండు నెలల గడువు ఇచ్చింది. సెప్టెంబర్ నుంచి మాత్రం తప్పక జిఎస్‌టి రిటర్న్ ఫైలింగ్ జరగాల్సిందేనని చెప్పింది. ఐటి నెట్‌వర్క్ ఇంకా సిద్ధం కాలేదంటూ శనివారం అసోచామ్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసిన నేపథ్యంలో ఆదివారం ఇక్కడ జైట్లీ నేతృత్వంలో సమావేశమైన జిఎస్‌టి కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూలై అమ్మకాల రిటర్న్ ఫైలింగ్ ఆగస్టు 10కి బదులుగా సెప్టెంబర్ 5లోగా చేయాలని, అలాగే ఆగస్టు అమ్మకాల రిటర్న్ ఫైలింగ్ సెప్టెంబర్ 10కి బదులుగా సెప్టెంబర్ 20లోగా చేయాలని సమావేశం అనంతరం విలేఖరులకు జైట్లీ చెప్పారు. ఇదిలావుంటే ఎసి హోటళ్లలో 5,000 రూపాయలకు మించి బిల్లు అయితే 28 శాతం పన్ను చెల్లించాలన్న నిబంధనను 7,500 రూపాయలకు పెంచారు. దీంతో 2,500-7,500 రూపాయల మధ్య ఉన్న బిల్లులకు ఇక 18 శాతం జిఎస్‌టినే వర్తిస్తుంది. లాటరీలకు రెండు విధాల పన్ను వేశారు. ప్రభుత్వం నడిపే వాటిపై 12 శాతం, రాష్ట్ర అధీకృత లాటరీలపై 28 శాతంగా నిర్ణయించారు. ఇకపోతే జిఎస్‌టికి సిద్ధమని ప్రముఖ పారిశ్రామిక సంఘం సిఐఐ స్పష్టం చేయగా, ఈ పరోక్ష పన్నుల విధానానికి తామూ సిద్ధమని రిటైలర్లు ప్రకటించారు. మరోవైపు మిగిలిపోయిన స్టాక్‌ను త్వరత్వరగా అమ్ముకునే పనిలో కన్జ్యూమర్ డ్యూరబుల్ వ్యాపారులున్నారు. ఇక కొనుగోలుదారులకు జిఎస్‌టి ప్రయోజనాలను అందేలా చూడాలని రియల్టర్లకు జైట్లీ సూచించారు.