బిజినెస్

జిఎస్‌టి, వర్షాలపై ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: పెద్దగా చెప్పుకోదగ్గవేమీ లేకపోవంతో ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను వర్ష సమాచారం అమితంగా ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నిర్ణయాలూ కీలకమేనని పేర్కొంటున్నారు. వచ్చే నెల 1 నుంచి జిఎస్‌టి అమల్లోకి వస్తున్నది తెలిసిందే. జూలై 1 నుంచి ఈ పరోక్ష పన్నుల విధానం (జిఎస్‌టి) అమల్లోకి వస్తుండగా, 5, 12, 18, 28 శ్లాబుల్లో వివిధ రంగాలకు చెందిన దాదాపు అన్ని వస్తువులకు కేంద్రం పన్ను రేట్లను కేటాయంచింది.
అయతే అధిక పన్ను విధించారన్న భావనలో ఉన్న పలు రంగాలు తమపై పన్నుల భారాన్ని తగ్గించాలని కోరుతున్నాయ. దీంతో కొన్నింటిని కేంద్రం సవరిస్తోంది కూడా. గత ఆదివారం జరిగిన సమావేశంలోనూ 66 వస్తువులపై జిఎస్‌టి కౌన్సిల్ పన్నులను తగ్గించింది. ఈ ఆదివారం జరిగిన సమావేశంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో వీటన్నిటి ప్రభావం మదుపరుల పెట్టుబడులపై ఉంటుందంటున్నారు మార్కెట్ విశే్లషకులు. మరోవైపు జిఎస్‌టి అమలును వాయదా వేయాలన్న ప్రతిపాదనలు నానాటికీ అధికమవుతుండటంతో దీనిపై ప్రభుత్వ స్పందనపట్లా మదుపరులు అమితాసక్తిని చూపిస్తున్నారు. వాయదా వేయడం కుదరదని మోదీ సర్కారు తెగేసి చెబుతున్నప్పటికీ, వాయదా అభ్యర్థనలు వ్యాపార, పారిశ్రామిక రంగాల నుంచి ఎక్కువగా వస్తుం డటంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా, రికార్డుల మోత మోగిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లలో గత రెండు వారాలు మాత్రం ఆ జోరు కనిపించలేదు. క్రిందటి వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 205.66 పాయంట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 80.20 పాయంట్లు పడిపోయాయ. సెనె్సక్స్ 31,056 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 9,588 వద్ద నిలిచింది. కాగా, ఏప్రిల్ నెలకుగాను విడుదలైన పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) గణాంకాలు మదుపరులను నిరాశపర చడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయ. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు తగ్గముఖం పట్టినప్పటికీ సూచీలు కోలుకోలేదు.
అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్.. ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు పావు శాతం పెరగడం కూడా కారణమే. ఇదిలావుంటే ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.