బిజినెస్

విశాఖ మన్యంలో పడిపోయిన కాఫీ దిగుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 19: విశాఖ మన్యంలో కాఫీ పంట దిగుబడి పడిపోయింది. అంతరించిపోతున్న అడవులు, కాఫీ పంట విస్తరణకు ముందస్తు కార్యాచరణ లేకపోవడం, ఈ పంట పండించేందుకు గిరిజన రైతులు ఆసక్తి చూపకపోవడం, వాతావరణంలో నెలకొన్న మార్పులు వంటివి కాఫీ దిగుబడి పడిపోవడానికి కారణాలుగా స్పష్టమవుతున్నాయి. నిరుడు రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజల సేకరణ జరగాలని లక్ష్యంగా పెట్టుకున్న గిరిజన సహకార సంస థ(జిసిసి).. ఈ ఏడాది దీనిని రెట్టింపు చేయాలని నిర్ణయించింది. నిజానికి పదేళ్ళ కాఫీ ప్రాజెక్టు అమల్లో భాగంగా కనీసం నాలుగు వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజల సేకరణకు ప్రణాళికలు రూపొందించింది.
అయితే దీనికి తగినట్టుగా కాఫీ పంట అందుబాటులోకి రావడంలేదని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. గిరిజన రైతుల నుంచి కాఫీ గింజల కొనుగోలులో దళారుల ప్రమేయాన్ని లేకుండా చేయడం, గిట్టుబాటు ధరను కల్పించి స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో భాగంగా ‘పదేళ్ళ కాఫీ ప్రాజెక్టు’ను జిసిసి చేపట్టింది. 2016లో ప్రారంభమైందిది. ఇందులో భాగంగా మన్యం లో ముఖ్యమైన ఆరు మండలాలను కేంద్రాలుగా తీసుకుని కాఫీ పంటను పండించేందుకు రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. అయితే ఐటిడిఎతో కలిసి నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా దేశ నలుమూలలకు అరకు కాఫీ రుచి చూపించాలని జిసిసి లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందుకోసం తొలుత గిరిజన రైతులను సభ్యులుగా చేర్చుకుంది. ఈ విధంగా అన్ని మండలాలకు సంబంధించి 96,337 గిరిజన రైతులు ఈ ప్రాజెక్టులో సభ్యులుగా చేరారు. 93,521 ఎకరాల్లో కాఫీ పంట సాగు జరిగింది. దీనివల్ల ఐదు నుంచి ఏడు వేల మెట్రిక్ టన్నుల మేర పంట పండించేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా తొలి ఏడాదిలో రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజల సేకరణ లక్ష్యంలో 70 శాతం మేరకు సఫలమై 1,403 మెట్రిక్ టన్నుల గింజలను సేకరించగలిగింది. ముందుగా నిర్ధేశించిన ప్రకారం దిగుబడి ఎక్కువగా ఉండే మండలాల్లో, సాధారణంగా పండించే ప్రాంతాలను క్యాటగిరీలుగా విభజించి రైతులకు ఒక్కో ధరను నిర్దేశించి అమలు చేయగలిగింది. కిలో పార్చ్‌మెంట్ కాఫీ రకానికి 90 రూపాయలు, చెర్రి రకం కాఫీకి 46 రూపాయలుగా గిరిజన రైతులకు చెల్లించారు. ఈ విధంగా నిరుడు 4,400 మంది గిరిజన రైతులకు దాదాపు 12 కోట్ల రూపాయల మేర సంస్థ చెల్లించింది. ఈ విధంగా జి.మాడుగుల, గూడేంకొత్తవీధి, చింతపల్లి మండలాల్లో పార్చ్‌మెంట్ రకం కాఫీని 80 శాతం మేర, చెర్రి రకం కాఫీని 53 శాతం మేర సేకరించగా, ఈ రెండింటితోపాటు క్లీన్ కాఫీని అందుబాటులోకి తీసుకురాగలిగింది. అత్యంత నాణ్యమైన కేటగిరీకి చెందిన క్లీన్ కాఫీ ధరను కిలోకి 76.21 రూపాయలుగా నిర్ణయించిన సంస్థ.. గిరిజన రైతులకు చెల్లింపులనూ చేసింది. అయితే ఊహించని విధంగా ఈ ఏడాది కాఫీ దిగుబడి పడిపోవడంతో ఒకవైపు గిరిజన రైతులు ఆందోళన చెందుతుండగా, మరోపక్క లక్ష్యాన్ని ఏ విధంగా సాధించాలో తెలియక జిసిసి యాజమాన్యం అయోమయంలో పడింది. దళారీ వ్యవస్థ నిర్మూలన, గిరిజన రైతులను ఆర్థికంగా ఆదుకోవడం, అరకు కాఫీ విశిష్టతను నలుదిశలు విస్తరించడం వంటి బహుళ ప్రయోజనాలు కలిగి ఉండే ఈ ప్రాజె క్టు కింద ఈ ఏడాది నిర్దేశించికున్న లక్ష్యాలపైనే గత కొంతకాలంగా సంస్థ దృష్టిపెట్టింది. అయి తే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఆశాజనకంగా లేవంటూ ఆందోళన చెందుతోంది.