బిజినెస్

విజయవాడ ఎస్‌బిఐకి చిన్న వెంకన్న బంగారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, జూన్ 20: చిన్న తిరుపతిగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామికి హుండీల ద్వారా, అలాగే కానుకల రూపేణా భక్తులు ఇచ్చిన బంగారు ఆభరణాలను ‘గోల్డ్ బాండు’ పథకంలో విజయవాడలోని ఎస్‌బిఐలో డిపాజిట్ చేశారు. 6.950 కిలోల బంగారాన్ని మంగళవారం బ్యాంకు అధికారులకు అప్పగించారు. గతంలో ఇదే పథకంలో సుమారు 56 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేశారు. కాగా, భక్తుల ద్వారా లభించిన 434.060 కిలోల వెండిని సైతం స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు.