బిజినెస్

ఆరునూరైనా జిఎస్‌టి ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వచ్చే నెల 1 నుంచే అమలవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పునరుద్ఘాటించారు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని ఆయన మంగళవారం ఇక్కడ స్పష్టం చేశారు. జిఎస్‌టి విధానానికి ఇంకా తాము సిద్ధం కాలేదని, అందుకు తగినంత సమయం ఇవ్వలేదనడం సరికాదన్నారు. జిఎస్‌టి అమలుతో మొదట్లో కొంత అసౌకర్యం, ఇబ్బందులు కలుగుతాయన్న జైట్లీ.. అయినప్పటికీ ఎలాంటి మినహాయింపులు ఉండబోవని విలేఖరులతో మాట్లాడుతూ తేల్చిచెప్పారు. ఆన్‌లైన్ రిటర్న్స్ దాఖలు చేయడానికి ట్రేడర్లకు, చిరు వ్యాపారులకు ఆరంభంలో సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చన్న ఆయన దేశ ప్రగతి కోసం తప్పదన్నారు. ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను నినాదంతో ఈ చారిత్రాత్మక పరోక్ష పన్నుల విధానాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీసుకొచ్చినది తెలిసిందే. పనె్నండుకుపైగా వేర్వేరు పన్నులను కలిపి జిఎస్‌టిగా మార్చారు. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్న జిఎస్‌టి క్రింద ఇప్పటికే 1,200లకుపైగా వస్తువులకు, 500ల సేవలకు పన్నులను నిర్ణయించారు.
5, 12, 18, 28 శ్లాబుల్లో నాలుగు రకాల పన్నులను వేసిన కేంద్రం.. ఒక్క బంగారంపై మాత్రం 3 శాతం పన్ను విధించింది. అలాగే తాజా ఆహార పదార్థాలు, విద్య తదితర కీలక రంగాలకు పన్ను మినహాయింపునూ ఇచ్చింది. అయితే అధిక పన్నులు వేశారంటూ ఆయా రంగాల నుంచి అసంతృప్తులు, వ్యతిరేకతలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొన్నింటిపై పన్నులను జైట్లీ నేతృత్వంలోని జిఎస్‌టి కౌన్సిల్ తగ్గించింది. ఈ క్రమంలో ఇక జిఎస్‌టి అమలు వాయిదా వేసే ప్రసక్తే లేదని కేంద్రం కరాఖండిగా చెబుతోంది. ఇప్పటికే పార్లమెంట్‌లో, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎన్నో అవాంతరాలను దాటుకుని జిఎస్‌టి తుది దశకు చేరుకున్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ దాని అమలు వాయిదాపడే ప్రసక్తే లేదని జైట్లీ అన్నారు. జిఎస్‌టి నెట్‌వర్క్ సిద్ధం కాలేదంటూ వాయిదా వేయాలని పారిశ్రామిక సంఘం అసోచామ్ జైట్లీకి లేఖ రాసిన క్రమంలో జిఎస్‌టి అమలుకు అసలు అది అడ్డుకాబోదన్నారు. అయినా ఇప్పటికే జిఎస్‌టి నెట్‌వర్క్ నడుస్తోందని గుర్తుచేశారు. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే జిఎస్‌టి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరక మూడు నెలలు ఆలస్యమైంది. కాగా, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి అతిపెద్ద సంస్కరణ జిఎస్‌టినేనని అంటున్న మోదీ సర్కారు.. దాన్ని కూడా ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు లభించిన స్వేచ్ఛగానే పరిగణిస్తోంది. అందుకే బ్రిటీష్ పాలకుల నుంచి భారతీయులకు అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చినదానికి గుర్తుగా, జిఎస్‌టిని కూడా అర్ధరాత్రే అట్టహాసంగా ప్రారంభిస్తోంది కేంద్రం. అన్ని పన్నుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు విముక్తిగా జిఎస్‌టిని పేర్కొంటూ ఈ నెల 30న అర్ధరాత్రి చారిత్రాత్మక పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో పరిచయం చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డి దేవేగౌడ, లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహజన్, పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఈ వేడుకకు హాజరవుతారు. ఇదిలావుంటే మంగళవారం కేబినెట్ కార్యదర్శి పికె సిన్హా.. జిఎస్‌టి అమలు సన్నాహకాలపై అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమీక్షా సమావేశంలో దాదాపు 167 ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధులూ పాల్గొన్నారు. ఇకపోతే జిఎస్‌టి అమలు విషయంలో ప్రభుత్వానికి అన్నివిధాలా సహకరిస్తామని అసోచామ్ తెలిపింది. అయితే జిఎస్‌టి నుంచి రహదారులు, రైల్వేల వంటి వౌలిక, రవాణా రంగాలకు మినహాయింపు ఇవ్వాలని కోరింది. మరోవైపు రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌తో ఉన్న ఆహారోత్పత్తులను జిఎస్‌టి నుంచి మినహాయించాలని అఖిల భారత ట్రేడర్స్ సమాఖ్య (సిఎఐటి) ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తమ ప్రతిషాఠత్మక కాఠ్యక్రమాలైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలకు జిఎస్‌టి మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో జైట్లీని కెటిఆర్ కలిసి విజ్ఞప్తి చేశారు. కాగా, జిఎస్‌టిలో హెల్మెట్లకు 18 శాతం పన్ను విధించడం వల్ల వాటి ధరలు పెరిగే వీలుందని, దీనివల్ల నాసిరకం హెల్మెట్లు మార్కెట్‌లోకి వచ్చే ప్రమాదం ఉందని, అదే జరిగితే ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకే ముప్పు అని ఐఎస్‌ఐ హెల్మెట్ తయారీదారుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. పన్ను రేటును తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే జిఎస్‌టి అమలైతే హెల్త్‌కేర్ ఖర్చులూ పెరుగుతాయని అపోలో హాస్పిటల్స్ చెప్పింది. కొన్ని సేవలు, ఉత్పత్తుల వ్యయం పెరిగి రోగులకు భారంగా మారవచ్చని అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి అన్నారు. ఇకపోతే క్రెడిట్ కార్డు బిల్లు, బీమా ప్రీమియం కూడా జిఎస్‌టితో ప్రియం అవనున్నాయి. కాగా, ఈ కొత్త పన్నుల విధానంలో ప్రస్తుత పరోక్ష పన్ను చెల్లింపుదారుల నమోదు తప్పనిసరి కావడంతో జిఎస్‌టి చట్టంలో 18 సెక్షన్లు, 2 నిబంధనలను మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.