బిజినెస్

స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 14.04 పాయింట్లు కోల్పోయి 31,297.53 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 4.05 పాయింట్లు పడిపోయి 9,653.50 వద్ద నిలిచింది. బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వ్యవసాయ రుణాల రద్దుకు సంబంధించిన వార్తలే ఇందుకు కారణం. సోమవారం పంజాబ్ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతుల రుణాలను రద్దు చేస్తామని ప్రకటించింది. అయితే ఇలాంటి ప్రతిపాదనేది కేంద్రం పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పినా మార్కెట్లు లాభాల్లోకి రాలేదు.