బిజినెస్

పన్ను చెల్లింపుదారుల వివరాలు ‘నాట్‌గ్రిడ్’ కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: భద్రతా ఏజన్సీల మధ్య టెర్రరిస్టులకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కోసం ఏర్పాటయిన నేషనల్ ఇంటెలిజన్స్ గ్రిడ్(నాట్‌గ్రిడ్) నెట్‌వర్క్ ఇకపై ఆదాయం పన్ను శాఖకు చెందిన పాన్ రికార్డులు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన వివరాలను కూడా పొందబోతోంది. యుపిఏ-2 పాలనలో అప్పటి హోం మంత్రి పి.చిదంబరం ఆలోచనతో ఈ బృహత్తర ప్రాజెక్టుకు రూపుదిద్దుకొంది. ఆదాయం పన్ను శాఖతో ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసిన తర్వాత త్వరలోనే నాట్‌గ్రిడ్‌కు ఈ కొత్త అధికారాలు లభించనున్నాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు విడుదల చేసిన ఒక ఉత్తర్వు ప్రకారం శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) మొదలుకొని పన్ను చెల్లింపుదారు పేరుతో పాటుగా తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఫోటో, సంతకం లేదా బొటనవేలి గుర్తులాంటి బల్క్ సమాచారాన్ని ఆ శాఖ నాట్‌గ్రిడ్‌తో పంచుకొంటుంది. అంతేకాకుండా పన్ను చెల్లింపుదారులకు సంబంధించి తమ డేటాబేస్‌లో అందుబాటులో ఉండే పన్ను చెల్లింపుదారుడి నివాసం, ఆఫీసు చిరునామాలు, ఉత్తర ప్రత్యుత్తరాలకోసం ఇచ్చిన చిరునామాలు, ఇ-మెయిల్ అడ్రస్సులు, ఫోన్, మొబైల్ నంబర్లులాంటి మొత్తం సమాచారాన్ని కూడా ఆదాయం పన్ను శాఖ ఈ నేషనల్ ఇంటెలిజన్స్ గ్రిడ్‌తో పంచుకొంటుంది.