బిజినెస్

ఈ ఏడాది 250 బియు విద్యుత్ ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో 250 బిలియన్ యూనిట్ల (బియు) విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న దిగ్గజ విద్యుత్ సంస్థ ఎన్‌టిపిసి (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర విద్యుత్ శాఖతో కుదుర్చుకున్న పనితీరు ఒప్పందం (పెర్ఫార్మెన్స్ ప్యాక్ట్)లో ఎన్‌టిపిసి ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అలాగే ఈ ఆర్థిక సంత్సరంలో తమ కార్యకలాపాల ద్వారా 79,280 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాలని ఎన్‌టిపిసి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన అవగాహనా ఒప్పందం (ఎంఓయు)పై ఎన్‌టిపిసి, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గురువారం సంతకాలు చేశాయి.