బిజినెస్

విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి వచ్చిన తర్వాత దేశంలో విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం లేదని, అందుకే జిఎస్‌టి అమలును వాయిదా వేయాల్సిందిగా పారిశ్రామిక సంఘాలు కోరలేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్న జిఎస్‌టితో కొత్త పన్నుల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని, జిఎస్‌టి కింద వస్తు, సేవలపై దేశ వ్యాప్తంగా ఒకేవిధమైన పన్నును వసూలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. విద్యుత్, బొగ్గు, గనులు, పునర్వినియోగ ఇంధన రంగాల అధికారులతో పియూష్ గోయల్ గురువారం న్యూఢిల్లీలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం పూర్తయిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ‘జిఎస్‌టి అమలు వలన విద్యుత్ చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నేను భావించడం లేదు. మహా అయితే ఒక్కో యూనిట్ విద్యుత్ ధరలో ఒకటి లేదా రెండు పైసల వ్యత్యాసం ఉండవచ్చు’ అని స్పష్టం చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి ఉప ఉత్పత్తిగా వెలువడే ఫ్లైయాష్‌తో తయారయ్యే ఉత్పత్తులపై జిఎస్‌టిలో పన్ను రేటు ఎంత ఉండాలన్న దానితో పాటు ఒకటి రెండు అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయని, వీటిని త్వరలో జరిగే జిఎస్‌టి కౌన్సిల్ తదుపరి సమావేశం ముందు ఉంచుతామని ఆయన తెలిపారు. జిఎస్‌టి చట్టం పట్ల పారిశ్రామిక వర్గాలన్నీ సంతృప్తితో ఉన్నాయని, అందుకే వస్తు, సేవల పన్ను అమలును వాయిదా వేయాల్సిందిగా కోరలేదని గోయల్ చెప్పారు.