బిజినెస్

ఎయిరిండియా రుణం.. తలకు మించిన భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా రుణాలు తలకు మించి భారంగా మారాయని, అందువల్ల దాన్ని ప్రైవేటు పరం చేయడం మంచిదని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా అంటూ, ఎయిరిండియా భవితవ్యంపై ప్రభుత్వ కార్యాచరణ ఆరునెలల్లోనే ఉండవచ్చని చెప్పారు. భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను బతికించుకోవడం కోసం దాన్ని ప్రైవేటుపరం చేసే విషయంతో పాటుగాప్రభుత్వం అనేక మార్గాలను అనే్వషిస్తోంది. ఎయిరిండియాలో వాటాను కొనుగోలు చేయడానికి టాటా గ్రూపు ఆసక్తితో ఉన్నట్లు మీడియాలో వార్తలు కూడా రావడం తెలిసిందే.‘నిజంగా ఎయిరిండియా ఇప్పుడు ఎక్కడ ఉందంటే దాదాపుగా ఉనికిని కాపాడుకునే స్థితిలో ఉందని నేను అనుకుంటున్నా.. ఇప్పటికే రుణభారం రూ 52 వేల కోట్లకు చేరుకుంది. ప్రతి ఏటా మరో నాలుగు వేల కోట్లు వచ్చి చేరుతోంది. అందువల్ల అది ఎంతమాత్రం మనుగడ సాగించలేదు’ అని పనగరియా ఓ ప్రైవేటు న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చివరికి ఎయిర్‌లైన్స్ మేనేజిమెంట్ ప్రైవేటు చేతుల్లోకి పోవలసిన అవసరం ఉందని తాను అనుకొంటున్నట్లు కూడా ఆయన చెప్పారు.
ఎయిరిండియాకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై ఓ వైపు చర్చలు కొనసాగుతుండగా దాన్ని పూర్తిగా ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఎయిరిండియాకు సంబంధించి ఈ ఏడాదిలోనే ఏదో ఒకటి జరుగుతుందని కూడా పనగరియా చెప్పారు. ‘ఇప్పటికే మనం జూన్‌లో ఉన్నాం. అంటే ఈ ఏడాదిలో మరో ఆరునెలలున్నాయి. ఏదయినా జరుగుతుందా లేదా అనేది బయ్యర్లపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రభుత్వం వైపునుంచి రాబోయే ఆరు నెలల్లో ఏదో ఒక చర్య ఉంటుంది’ అని ఆయన అన్నారు.
ఎయిరిండియాకు సంబంధించి సమస్యలున్నాయని ఇంతకు ముందు ప్రభుత్వాలు సైతం గుర్తించాయి కానీ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని ఆయన గుర్తు చేస్తూ, అయితే ప్రధాని నరేంద్ర మోదీ వారికన్నా ధైర్యవంతుడే కాక కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తని అన్నారు. గత యుపిఏ ప్రభుత్వం ప్రకటించిన 30 వేల కోట్ల బెయిలవుట్ ప్యాకేజిపై ఎయిరిండియా ఇప్పుడు మనగలుగుతోంది. ఎయిరిండియా ప్రైవేటీకరణను ఏ విధంగా చేయాలనే విషయంపై అన్ని మార్గాలను పౌర విమానయాన శాఖ పరిశీలించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇటీవల చెప్పారు.