బిజినెస్

సరికొత్త రికార్డుకెళ్లినా స్వల్ప లాభాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 22: పెట్టుబడులను ఆకర్షించే విధంగా మార్కెట్ ప్రవేశపెట్టిన నిబంధనలను సరళీకృతం చేయనున్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఆరంభంనుంచి లాభాల బాటలో పరుగులు పెట్టిన దేశీయ సూచీలు చివరివరకు ఆ జోరును కొనసాగించలేక పోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల కారణంగా మదుపరుల లాభాల స్వీకరణకు దిగడంతో ఒత్తిడికి లోనయిన సెనె్సక్స్ స్వల్ప లాభాలకు పరిమితం కాగా, నిఫ్టీ స్వల్ప నష్టాలు చవి చూసింది. ఆరంభ ట్రేడింగ్‌లోనే 130 పాయింట్ల లాభాల్లో సాగిన సెనె్సక్స్ ఒకానొక దశలో 239 పాయింట్లకు పైగా పెరిగి 31,522.87 పాయింట్ల జీవిత కాల గరిష్ఠస్థాయిని తాకినప్పటికీ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో దాన్ని కొనసాగించలేకపోయింది. చివరికి 7 పాయింట్ల స్వల్ప లాభంతో 31,290.74 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ సైతం అదే ధోరణిలో సాగినప్పటికీ చివరికి 3.60 పాయింట్ల నష్టంతో 9,630 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో పాటుగా డాలరుతో రూపాయి బలహీనంగా ఉండడం కూడా సూచీలపై ఒత్తిడి పెంచాయి.