బిజినెస్

ఎయిర్‌టెల్ డిజిటల్ కస్టమర్ కేర్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: భారతీ ఎయిర్‌టెల్.. శుక్రవారం 11 భారతీయ భాషల్లో డిజిటల్ కస్టమర్ కేర్ సేవలను ప్రారంభించింది. హిందీ, పంజాబీ, మరాఠి, గుజరాతి, తమిళ్, కన్నడ, బంగ్లా, ఒడియా, అస్సామీ తదితర భాషల్లో ఈ డిజిటల్ కస్టమర్ కేర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్‌టెల్ వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ల నుంచి స్టార్ 121 యాష్‌కు డయల్ చేస్తే క్షణాల్లో సదరు సేవలను సులభంగా అందుకోవచ్చని ఓ ప్రకటనలో ఎయిర్‌టెల్ తెలిపింది. ఇకపై సమస్యలతో తమ కస్టమర్ కేర్ ఉద్యోగితో మాట్లాడనవసరం లేదని, ఎయిర్‌టెల్ రిటైల్ స్టోర్‌కూ రానక్కర్లేదంది.