బిజినెస్

రూ. 2,920 కోట్లు నష్టపోతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు వల్ల 2,920 కోట్ల రూపాయల మేర రాష్ట్ర ఆదాయాన్ని కోల్పోతు న్నామని ఏపి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా జిఎస్‌టి అమల్లోకి వస్తున్న క్రమంలో ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో జిఎస్‌టి అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో జిఎస్‌టి అమలుపై ఆర్థిక శాఖ అధికారులతో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాకు జిఎస్‌టి అమలు వల్ల నష్టం కలుగుతున్నప్పటికీ, కేంద్రం దీనిని భర్తీ చేస్తుందన్నారు. ఇందుకు వీలుగా సెస్ వసూలు చేయనున్నారని, నష్టపోయిన రాష్ట్రాలకు దీని నుంచి చెల్లిస్తారన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎపిజిఎస్‌టి నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు. కాగా, రాష్టవ్య్రాప్తంగా 21 వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. సిబ్బందిని ఆయా విభాగాల్లో సర్దుబాటు చేశామన్న యనమల.. ఇ-వేబిల్లులను ఇప్పటికే అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కొంతకాలం కొనసాగించాలని జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయించిందన్నారు.
అయతే ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. మరోవైపు జిఎస్‌టి అమలు వల్ల 115 వస్తువులకు పన్ను తగ్గనుందని, 37 వస్తువులపై పన్నులు పెరుగుతాయని, మరో 180 వస్తువులపై జిఎస్‌టి ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొన్నారు. అలాగే సేవా రంగంలో 14 అంశాల్లో పన్ను భారం తగ్గుతోందని, 27 అంశాల్లో పెరుగుతుందన్నారు. ఎరువులు, ట్రాక్టర్లు, గ్రానైట్, పొగాకు, ప్రాంతీయ సినిమాల టిక్కెట్లు, టిటిడికి సంబంధించి కొన్ని అంశాలతోపాటు మరికొన్నింటిపై పన్ను తగ్గించాలని కోరామన్నారు. కానీ తగ్గించలేదని, అయనప్పటికీ మరోసారి కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలావుంటే ఈ చట్టంలో యాంటీ ప్రాఫిటీరింగ్ క్లాజ్ పొందుపరిచారని, ఇన్‌పుట్ ట్యాక్స్ రిటర్న్‌ను క్లైమ్ చేసిన సందర్భాల్లో ఆ లబ్ధిని వినియోగదారుడికి బదలాయించాల్సి ఉంటుందన్నారు.
చాలా దేశాల్లో ఇది అమల్లో ఉందన్నారు. బడ్జెట్ అంచనాల ప్రకారం పన్నుల కింద రాష్ట్రానికి 39 వేల కోట్ల రూపాయలు వస్తుందని, మద్యం, పెట్రోల్‌పై పన్ను మినహాయిస్తే, 22 వేల కోట్ల రూపాయలు రావాలన్నారు. దీని ఆధారంగా నష్టపరిహారం వస్తుందన్న మంత్రి యనమల.. జిఎస్‌టిలో పన్నుల చెల్లింపులకు మానవ జోక్యం వీలైనంత తగ్గుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

చిత్రం.. ఏపి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు