బిజినెస్

ఎల్‌ఐసి ప్రైవేటీకరణను అడ్డుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: ప్రభుత్వరంగ జీవిత భీమా సంస్థ (ఎల్‌ఐసి)ని ప్రైవేటీకరించాలనే కుట్రను అడ్డుకోవాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆ సంస్థ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొని, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు దోహదపడుతున్న ఎల్‌ఐసిని ప్రైవేటీకరించాలనే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని మఖ్ధుం భవన్‌లో ఆల్ ఇండియా ఎల్‌ఐసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ రెండు రోజుల జాతీయ సమావేశాలను శనివారం సురవరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌ఐసిలో ఇంతవరకు ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ సిబ్బందిని అభినందించారు. దేశంలోకి ఎఫ్‌డిఐలను పెద్ద ఎత్తున ఆహ్వానించి పారిశ్రామికవేత్తలు, ఎంఎన్‌సిలు సంతోషం గా ఉంటే దేశం మొ త్తం సంతోషంగా ఉన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.