బిజినెస్

బోర్డు-ప్రమోటర్లకు మధ్య విభేదాల్లేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 24: బోర్డు సభ్యులకు, ప్రమోటర్లకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరోసారి ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ అయిన ఇన్ఫోసిస్ 36వ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం (ఎజిఎమ్) శనివారం ఇక్కడ జరిగింది. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్‌పై మీడియాలో వస్తున్నవన్నీ కల్పనలేనని, సంస్థలో భయపడాల్సినటువంటి సమస్యలేమీ లేవంది. ఈ క్రమంలోనే ఉన్నతస్థాయి ఉద్యోగులకు, క్రిందిస్థాయి ఉద్యోగులకు మధ్య వేతనాల్లో ఉన్న వత్యాసంపై ఇన్ఫోసిస్ స్పందిస్తూ దీనిపై తమకు అవగాహన ఉందంది. అర్హత ఆధారంగానే జీతభత్యాలను చెల్లిస్తున్నామని స్పష్టం చేసింది. దీనిపై వస్తున్నవన్నీ మీడియా సృష్టేనని పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ విషయంపై ఎన్‌ఆర్ నారాయణమూర్తి తదితర సంస్థ వ్యవస్థాపకులు మాట్లాడుతూ బోర్డు నిర్ణయాలను తప్పుబట్టినది తెలిసిందే. సిఇఒ విశాల్ సిక్కా వేతనాన్ని పెంచడంపై అసృంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఉద్యోగుల్లో అభద్రతాభావం పెరుగుతుందని, అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ప్రమోటర్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆర్ శేషసాయి పునరుద్ఘాటించారు. అయితే సంస్థ వ్యవస్థాపకుల అభిప్రాయాలను గౌరవిస్తామని, వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తామని చెప్పారు. ఇక నగదు నిల్వలపై మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి 31 నాటికి నగదు, నగదుతో సమానమైన ఆస్తుల విలువ 12,222 కోట్ల రూపాయలుగా ఉందని, నిరుడు మార్చి 31 నాటికి ఇది 24,276 కోట్ల రూపాయలుగా ఉందన్నారు. డిపాజిట్లు ఈ మార్చి 31 నాటికి 6,931 కోట్ల రూపాయలకు పెరిగాయని, క్రిందటి మార్చి 31కి 4,900 కోట్ల రూపాయల వద్దే ఉన్నాయని తెలిపారు. ఇదిలావుంటే ఈ సందర్భంగా గత ఆర్థిక సంవత్సరానికి (2016-17) గాను తుది డివిడెండ్‌ను ఒక్కో షేర్‌కు 14.75 రూపాయలుగా ప్రకటించింది ఇన్ఫోసిస్. ఇది దాదాపు 4,061 కోట్ల రూపాయల చెల్లింపులని చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) భాగస్వాములకు 13,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరగవచ్చని ఇన్ఫోసిస్ తెలిపింది. ఇందులో డివిడెండ్లు, బైబ్యాక్‌లు ఉంటాయంది. మరోవైపు ఆటోమేషన్ కారణంగా 11 వేలకుపైగా ఉద్యోగులను ఇన్ఫోసిస్ రిలీజ్ చేసింది. కాగా, సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన ఆర్ శేషసాయి వచ్చే ఏడాది మేలో పదవీ విరమణ పొందుతున్నారు. 2018 మే నాటికి 70 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలో తన స్థానంలో వచ్చే వ్యక్తికి సంస్థను ఓ సమస్యగా అప్పగించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఇకపోతే సంస్థ సిఇఒ విశాల్ సిక్కా.. భాగస్వాములకు రాసిన లేఖలో గత ఆర్థిక సంవత్సరం సంస్థకు ఎన్నో రకాల సవాళ్లు ఎదురయ్యాయని అన్నారు. అయినప్పటికీ అన్నిటినీ అధిగమించి ముందుకు వచ్చామంటూ ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) అంతా బాగుంటుందన్న విశ్వాసాన్ని కనబరిచారు. భాగస్వాముల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామని, సంస్థను లాభాల్లో, వృద్ధిపథంలో నడిపిస్తామని విశాల్ సిక్కా వాగ్ధానం చేశారు.