బిజినెస్

పథకాల అమలుకు 60 శాతం నిధులిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో 60 శాతం నిధులను కేంద్రమే భరిస్తోందని, అదే విధంగా రాష్ట్రాలకు పన్నులలో ఇదివరకు 32 శాతం వాటా ఇవ్వగా, దానిని తాము 42 శాతానికి పెంచామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో భాగంగా ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ ఫీల్డు పబ్లిసిటీ (డిఎఫ్‌పి) ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఏర్పాటైన ప్రాంతీయ వర్కుషాప్‌ను మంత్రి శనివారం ప్రారంభించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి అట్టడుగు స్థాయిలో మరింత ప్రచారం చేయాలని ఆయన సూచించారు. అభివృద్ధి ప్రక్రియకు ప్రోత్సాహం అందించే క్రమంలో సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం వ్యాప్తిలోకి రావడం కీలకమైన విషయమన్నారు. వివిధ ప్రభు త్వ పథకాలపై వర్కుషాప్‌ను నిర్వహిస్తున్నందుకు డిఎఫ్‌పిని దత్తాత్రేయ ప్రశంసించారు. దేశం పురోగమించాలంటే వృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాల వారికీ అందించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సమ్మిళిత వృద్ధిపై శ్రద్ధ వహిస్తోందని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, సుకన్య సమృద్ధి యోజనల వంటి పథకాలు దేశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని దత్తాత్రేయ పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల వారి అభ్యున్నతికి ఎన్‌డిఎ ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు. సంక్షేమ పథకాల సమాచారాన్ని గ్రామాల స్థాయిలో మరింత ఎక్కువగా ప్రచా రం చేయాల్సిందిగా ఆయన కోరారు.