బిజినెస్

నేటి నుంచి జిఎస్‌టి నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: వచ్చే నెల 1 నుంచి ప్రస్తుతం అమలులో ఉన్న పన్నుల విధానానికి బదులు వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి రానున్నందున డీలర్లు అందరూ జిఎస్‌టి నెట్‌వర్క్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి వస్తోంది. జిఎస్‌టిఎన్ పోర్టల్‌లో ఆదివారం నుంచే డీలర్లు నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న డీలర్లతోపాటు కొత్త డీలర్లు కూడా జిఎస్‌టిఎన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ తెలిపారు.
జిఎస్‌టి నమోదుకు సంబంధించి సందేహాలు నివృత్తి చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలు అన్నింటిలోనూ సెంటర్స్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సెలవురోజు అయినప్పటికీ ఈ కేంద్రాలు 25,26,27 తేదీల్లో పని చేయనున్నాయ. డీలర్లు ఎలాంటి సందేహం ఉన్నా ఈ కేంద్రాలను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. నిజానికి జిఎస్‌టికి సంబంధించి అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికే ఇంకా స్పష్టత లేదు. అయినప్పటికీ ఈ నెలాఖరున అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తుందని కేంద్రం ప్రకటించడంతో వ్యాపార వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు బట్టల వ్యాపారాన్ని జిఎస్‌టి నుంచి మినహాయించాలని వస్త్ర వ్యాపారులు హైదరాబాద్‌లో, ఢిల్లీలో ఆందోళన చేశారు. అన్ని సేవలు, వస్తువులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకు వచ్చి పెట్రోల్‌ను మాత్రం ఎందుకు మినహాయించారని వామపక్షాలు నిలదీశాయి. జిఎస్‌టిలో అత్యధిక పన్ను 28 శాతం. అయితే పెట్రోల్‌ను మాత్రం జిఎస్‌టి పరిధిలో చేర్చలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రోల్ ప్రధాన ఆదాయ వనరు. పెట్రోల్‌పై ప్రస్తుతం 57 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. దీనిలో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం 23 శాతం విధిస్తోంది. రాష్ట్రాలు విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రూపంలో 34 శాతం వరకు విధిస్తున్నాయ. అయతే జిఎస్‌టిలో చేరిస్తే పన్ను 18 శాతానికి పరిమితం అయ్యేది. కాగా, జిఎస్‌టితో కొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయని, కొన్నింటి ధరలు పెరుగుతాయనే ప్రచారం సాగుతున్నా, అమలులోకి వచ్చేంత వరకు పరిస్థితి తెలియదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు అఖిల భారత వాణిజ్య సమాఖ్య (సిఎఐటి) సైతం దేశవ్యాప్తంగా జిఎస్‌టి సజావుగా అమలయ్యేందుకు 100 జిఎస్‌టి క్లీనిక్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇవి ట్రేడర్లకు సహాయకారిగా ఉంటాయని సిఎఐటి జాతీయ అధ్యక్షుడు బిసి భర్తియా, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ ఓ ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 6 కోట్ల మంది ట్రేడర్ల కోసం తాము హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ట్యాలి సొల్యూషన్స్, మాస్టర్‌కార్డ్‌తో కలిసి పనిచేయనున్నట్లు వారు వివరించారు.